రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపనై ఇవ్వాళ్టితో (విజయ దశమి) నూరు సంవత్సరాలు పూర్తయ్యాయి. సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళే లిఖిత పూర్వక సందేశంలోని సారాంశం...
'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ యాత్రా కాలంలో చాలా మంది తమ సహకారాన్ని ఇచ్చారు, భాగస్వాములు కూడా అయ్యారు. ఈ ప్రయాణం కచ్చితంగా శ్రమతో కూడుకున్నదే. అనేక ఇబ్బందులతో కూడా. కానీ సామాన్య ప్రజలు దానిని సాఫీగా తీసుకెళ్లారు. వందేళ్ల ప్రయాణం సందర్భంగా తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన అనేక మంది కార్యకర్తలు గుర్తుకొస్తారు. అనేక సందర్భాలు కూడా స్మరణకొస్తాయి.
తొలి నాళ్లలో యువ కార్యకర్తలు యోధుల మాదిరిగా దేశం మీద ప్రేమలో మునిగి తేలి సంఘ కార్యాన్ని దేశ వ్యాప్తంగా విస్తరించడానికి బయల్దేరారు. అప్పాజీ జోషి లాంటి గృహస్థులతో పాటు ప్రచారకుల రూపంలో దాదారావు పరమార్థ్, బాలాసాహేబ్ భావూరస్ బంధు, యాదవ రావు జోషి, ఏకనాథ్ రాణడే మొదలైన వారు డాక్టర్జీ సాన్నిహిత్యంలోకి వచ్చి, సమాజ సేవే జీవనవ్రతంగా స్వీకరించి, జీవన పర్యంతం పనిచేశారు.
సమాజం నిరంతరంగా తగిన ప్రోత్సాహం, సమర్థన చేయడం వల్లే సంఘ కార్యం ముందుకు సాగుతోంది.
సంఘ కార్యం సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా వుండటంతో క్రమక్రమంగా దీనిని స్వీకరిస్తూ పోతోంది. స్వామి వివేకానంద విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడి వారు ఓ ప్రశ్న వేశారు. ‘‘మీ దేశంలో అధిక మంది నిరక్షరాస్యులే. ఇంగ్లీషు అసలే రాదు. అలాంటప్పుడు మీ పెద్ద పెద్ద ఉపన్యాసాలను ఎలా అర్థం చేసుకుంటారు? వారి వరకు ఎలా చేరుతాయి?’’ అంటూ ప్రశ్నించారు. అప్పుడు వివేకానంద బదులిస్తూ ‘‘చక్కెర ఎక్కడున్నా చీమలు వాటి వాసనను ఎలా పసిగట్టడానికి ఆంగ్లం తెలవాల్సిన అవసరం లేదు. అలాగే నా భారతీయులకు ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడున్నా, సాత్వికమైన కార్యం ఏ మూలన జరుగుతున్నా... వేగంగా తెలుసుకుంటారు. కిమ్మనకుండా, గుట్టుచప్పుడు కాకుండా అక్కడికి చేరుకుంటారు. అలాగే వారు నా మాటలను కూడా అర్థం చేసుకుంటారు. దీనిని కాలం కూడా నిరూపించింది.’’ అని అన్నారు. అలాగే సాత్వికతతో కూడిన సంఘ కార్యాన్ని మెళ్లిగా అయినా సామాన్యులు స్వీకరించడం లేదా సమర్థించడం జరుగుతూనే వుంది.
మొదటి నుంచి కూడా సంఘ కార్యం ఇంటింటికీ వెళ్లి, వ్యక్తులను కలవడం ద్వారా, లేదా సామాన్య కుటుంబాల ద్వారా జరుగుతూ వస్తోంది. వీరి ద్వారానే సంఘ కార్యకర్తలకు ఆశ్రయం లభించడమో, ఆశీర్వాదాలు లభించడమో జరుగుతూ వస్తోంది. స్వయంసేవకుల ఇల్లే సంఘ కార్యం నడవడానికి కేంద్రమైంది. మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్ల సహకారంతో ముందుకు సాగుతోంది. దత్తోపంథ్ ఠేంగ్డే, యశ్వంత రావు కేల్కర్, బాలాసాహేబ్ దేశపాండే, ఏకనాథ్ రాణడే, దీనదయాళ్ ఉపాధ్యాయ అలాగే దాదా సాహేబ్ ఆప్టే లాంటి వారు సంఘాన్ని ప్రేరణగా స్వీకరించి, సమాజంలో వివిధ రంగాల్లో వివిధ సంస్థలను ప్రారంభించడంలో కీలక భూమిక పోషించారు. ఈ సంస్థలు సమాజంలో విస్తరించి, సమాజలో సకారాత్మకమైన మార్పులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే మహిళల విషయంలో జాతీయ భావాల కోసం రాష్ట్ర సేవికా సమితి మాధ్యమంగా మౌసీజీ కేల్కర్ నుంచి మొదలు ప్రమీలా తాయి మేఢే లాంటి మాతృమూర్తుల భాగస్వామ్యం ఈ యాత్రలో అత్యంత మహత్వపూర్ణంతో కూడుకున్నది.
దేశం హితాన్ని దృష్టిలో పెట్టుకొని సంఘ్ మాధ్యమంగా చాలా సమస్యలను లేవనెత్తాం. వీటన్నింటికి కూడా సమాజంలోని విభిన్న రంగాల ద్వారా మద్దతు కూడా లభించింది. కొన్ని సార్లు సార్వజనీనంగా చూసుకుంటే మనకు విరుధోలుగా కనిపించే వారు కూడా భాగస్వాములయ్యారు. యావత్ హిందూ సమాజానికి సంబంధించిన విషయాల్లో అందరి సహాయ సహకారాలు వుండాలని కూడా సంఘం ప్రయత్నించింది.దేశం యొక్క ఏకత, సురక్ష, సామాజిక సమరసత, ప్రజాస్వామ్య ధర్మం, సంస్కృతి లాంటి విషయాలను రక్షించే విషయంలో అత్యధికమంది స్వయంసేవకులు చెప్పలేనన్ని కష్టాలను ఎదుర్కొన్నారు. చాలా మంది బలిదానం కూడా అయ్యారు. వీటన్నింటిలోనూ సమాజం మద్దతు ఎప్పుడూ వుంటూ వస్తోంది.
1981 లో తమిళనాడులోని మీనాక్షీపురంలో కొంత మంది హిందువులను ప్రలోభపెడుతూ అక్రమ మత మార్పిళ్లు జరిగాయి. ఈ సమయంలో హిందవుల్లో జాగరణ తీసుకువచ్చే క్రమంలో ఓ సమ్మేళనం జరిగింది. అందులో దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. దీనికి అప్పటి కాంగ్రెస్ అగ్రనేత డాక్టర్ కర్న సింగ్ హాజరయ్యారు. 1964 లో విశ్వహిందూ పరిషత్ స్థాపన సమయంలో ప్రసిద్ధ సన్యాసులు స్వామి చిన్మయానంద, మాస్టర్ తారా సింగ్ తో పాటు జైన ముని సుశీల్ కుమార్ గారు, బౌద్ధ భిక్షువు కుశోక్ బకుల్, సిక్కు గురువు సద్గురు జగజీత్ సింగ్ ప్రముఖ పాత్ర పోషించారు. హిందూ ధర్మంలో అస్పృశ్యతకి స్థానం లేదని మరో సారి చాటి చెప్పే ఉద్దేశంతో గురూజీ గోళ్వాల్కర్ మొదటి సారి ఉడిపిలో విశ్వహిందూ సమ్మేళనం నిర్వహించారు. దీనికి ధర్మాచార్యులతో పాటు సాధు సంతులు హాజరై, ఆశీర్వదించారు. అలాగే ప్రయాగలో జరిగిన సమ్మేళనంలో ‘‘న హిందు: పతితో భవేత్’’దానిని చెప్పారు. అలాగే హైందవా: స్సోదరా సర్వే’’ అని చాటి చెప్పడం కూడా దీని ఉద్దేశం. హిందువులందరూ భారత మాత సంతానమే అని ఉద్ఘోషించారు. అలాగే ఇందులో గోహత్యను ఆపడం, రాజజన్మభూమి అభియాన్, కూడా వుంది. సంఘ స్వయంసేవకులకు ఎల్లప్పుడూ సాధు సంతుల ఆశీర్వాదాలు లభిస్తూనే వుస్తున్నాయి.
స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజకీయ కారణాలతో అప్పటి ప్రభుత్వం సంఘ కార్యంపై నిషేధం విధించింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సామాన్యులతో పాటు సజ్జనులు, ప్రతిష్ఠ కలిగిన వ్యక్తులు కూడా సంఘానికి మద్దతుగా నిలిచి, సంఘ కార్యానికి సహకారాన్నిచ్చారు. ఇదే పరిస్థితి ఎమర్జెన్సీ సమయంలో కూడా అనుభవంలోకి వచ్చింది. ఇంతటి బాధల్లోనూ సంఘ కార్యం చెక్కుచెదరకుండా క్రియాత్మకంగా ఎల్లప్పుడూ సాగుతూనే వుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో సంఘం, సంఘ స్వయంసేవకుల బాగోగులు చూసుకునే మహత్తర కార్యం మాతృమూర్తులు, అక్కాచెల్లెల్ల భుజస్కందాలపై పడింది. దీనిని అత్యంత కుశలతతో వారు పూర్తి చేశారు. ఇవన్నీ సంఘ కార్యానికి అత్యంత ప్రేరణాదాయకాలుగా నిలిచాయి.
రాబోయే రోజుల్లో దేశ సేవలో సమాజంలోని అన్ని వర్గాల సహాయ సహకారాల కోసం సంఘ కార్య శతాబ్ది సందర్భంగా స్వయంసేవకులు ఇంటింటికి తిరుగుతూ, కుటుంబాలను కలుస్తూ విశేష ప్రయత్నం చేస్తారు. సంఘాన్ని దేశంలోని మహానగరాలు, సుదూర గ్రామాలతో పాటు అన్ని వర్గాలకూ చేరువ కావడమే లక్ష్యం పెట్టుకున్నారు. దేశ సర్వాంగీణ వికాసం కోసం దేశంలోని సజ్జన శక్తి మాధ్యమంగా రాబోయే ఈ యాత్ర సుగమం, సఫలమవుతుంది.''

