![]() |
| Huge explosion in Delhi.. 11 people killed, suspect arrested |
దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ప్రమాదం అనంతరం ఏడు అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలికి చేరుకున్నారు.
మరో వైపు ఈ పేలుడు సంభవించడంతో పోలీసు విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం, క్లూస్ టీమ్, ఎన్ఐఏ ఘటనా స్థలికి చేరుకున్నాయి. అయితే.. పేలుడు పదార్థాలలో ఉపయోగించే అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లు లభించినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.అంతేకాకుండా పేలుడు ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడ్ని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఉగ్రవాదుల హస్తం ఏమైనా వుందా? అన్న దానిపై కూడా వేగంగా దర్యాప్తు చేస్తోంది ఎన్ఐఏ.
భారీ పేలుడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేలుడు ధాటికి చుట్టుపక్కల వున్న కార్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆరు కార్లు, రెండు ఇ రిక్షాలు, ఓ ఆటో రిక్షా మంటల్లో కాలిబూడిదయ్యాయి.
దాదాపుగా భారత భద్రతా దళాలు నిరంతరం అప్రమత్తంగానే వున్నాయి. ఎప్పటికప్పుడు ఇస్లామిక్ ఉగ్రవాదులను గుర్తిస్తూ, వారి వ్యూహాలను తుత్తునీయలు చేస్తూనే వున్నారు. అయినా సరే ఢిల్లీలో తాజా పేలుళ్లు విచారించదగ్గ అంశమే. తాజాగా సోమవారం ఉదయమే ఢిల్లీ, హర్యానా పోలీసులు భారీ ఇస్లామిక్ ఉగ్రవాద కుట్రను భగ్నం చేశాయి. నిషేధిత జైషే మహ్మద్,అన్సార్ ఘజవత్ ఉల్ హింద్ ఉగ్రసంస్థలతో సంబంధమున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ముగ్గురు వైద్యులు కూడా. వీరి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే ఆదివారం కూడా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు మరో కుట్రను భగ్నం చేశారు. గుజరాత్ గాంధీనగర్ లోని అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసింది. గుజరాత్ లో ఉగ్రదాడికి ప్రణాళికలు వేసినట్లు విచారణలో తేలింది. మరోవైపు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి తుపాకులు, విషపూరిత రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా విచారణ కొనసాగుతోందని ఏటీఎస్ పేర్కొంది.
అరెస్ట్ అయిన వారిలో అబ్దుల్ ఖాదర్ జిలానీ కుమారుడు డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, మహ్మద్ సులేమాన్ కుమారుడు మహ్మద్ సుహైల్ మరియు సులేమాన్ సైఫీ కుమారుడు ఆజాద్ అనే ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది.అరెస్టయిన డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ హైదరాబాద్ నివాసి. మొహమ్మద్ సుహెల్ మొహమ్మద్ సులేమాన్ మరియు ఆజాద్ సులేమాన్ సైఫీ ఇద్దరూ ఉత్తరప్రదేశ్ నివాసితులు.
అలాగే సరిగ్గా ఐదు రోజుల క్రితం జమ్మూకశ్మీర్ లోని కిష్తివాడ్ లోని ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల హైడవుట్ పై నిఘా వర్గాల సమాచారం మేరకు సైనిక బలగాలు ఈ రోజు ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు బుధవారం ఆపరేషన్ ఛత్రును ప్రారంభించాయి.కిష్త్వార్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కొని ఉన్నారన్న గూఢచారి సమాచారం రావడంతో బలగాలు అక్కడకు చేరుకుని వారిని పూర్తిగా ముట్టడించాయి. ఈ ఆపరేషన్ కి ఛత్రు అని నామకరణం చేశారు.
దీనితో సైనికులు,ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు తెలిసింది.కిష్త్వార్లోని ఛత్రు ప్రాంతంలో ఆ ముగ్గురుఉగ్రవాదులు గతకొన్ని నెలలుగా నల్లచాటున ఉంటున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి.ఈసమాచారంపై ఆధారపడి భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్,కశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజామునే ఇంటి ఇంటికీ తనిఖీలతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

