![]() |
| Christian bus conductor insults Hindu priest |
తమిళనాడులో హిందువులకు అవమానాలు ఎదురవుతూనే వున్నాయి. తాజాగా తమిళనాడు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ అర్చకుడిని తీవ్రంగా అవమానించాడు. హిందూ అర్చకుడు బాల సుబ్రమణియన్ తన కుటుంబంతో కలిసి బస్సులో ప్రయాణించాడు. ఈ సమయంలోనే అర్చకుడి విషయంలో మత పరమైన వివక్ష చూపించడంతో పాటు తీవ్రంగా అవమానించాడు కండక్టర్ ఆంటోనీ.
తిరునల్వేలి కొత్త బస్టాండ్ నుండి నాగర్‌కోయిల్‌కు ఉదయం 5 గంటల ప్రాంతంలో బయలుదేరే ప్రభుత్వ బస్సు (రిజిస్ట్రేషన్ TN-74 N-2120)లో ఈ సంఘటన జరిగింది.
బస్సు వల్లియూర్ లోకి వెళ్లదని, బైపాస్ వద్ద మాత్రమే ఆపేస్తున్నట్లు కండక్టర్ ఆంటోనీ చెప్పాడు. దీంతోనేఅసలు గొడవ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ‘‘కేవలం నీ ఒక్కడి కోసం వల్లియూర్ గుండా తీసుకెళ్లాలా? కుదరదు’’ అని కండక్టర్ కసురుకుంటూ చెప్పాడు ఈ బస్సులో చాలా మంది క్రిస్టియన్ ప్రయాణికులేనని అర్చకుడు’’ పేర్కొన్నాడు.
బస్సు కండక్టర్ ఆంటోనీ తన పట్ల వివక్ష చూపిస్తున్నాడని అర్చకుడిని అర్థమైపోయింది. దీంతో రోడ్డుపైనే నిరసనకు దిగాడు. దీంతో స్థానికులు గుమిగూడారు. అర్చకుడికే మద్దతు పలికారు. దీంతో కాసేపటికి పోలీసులు కూడా వచ్చారు. ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఎట్టకేలకు కండక్టర్ ఆంటోనీ వల్లియూర్ లోకి బస్సును తీసుకెళ్లాడు.
స్థానిక మీడియాతో మాట్లాడుతూ బాలసుబ్రమణియన్, "ఆ బస్సును ప్రత్యేకంగా నాలుమావాడి నుండి వచ్చిన క్రైస్తవుల కోసం అద్దెకు తీసుకోలేదు. మా అందరికీ టిక్కెట్లు ఉన్నాయి. కండక్టర్ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు కూడా చేశాడు, దానిని నేను వీడియోలో రికార్డ్ చేసాను" అని అన్నారు. కండక్టర్ తన రూపాన్ని, వేషధారణను, సంప్రదాయ దుస్తులను కూడా ఎగతాళి చేశాడని ఆయన ఆరోపించారు.
ఇక.. దీనిపై తమిళనాడు ఆర్టీసీ అధికారులు స్పందించారు. శాఖాపరమైన విచారణను ప్రారంభించినట్లు తెలిపారు. ఇదే మార్గంలో గతంలోనూ ఇలాంటి సంఘటన జరిగిందని, వల్లియూర్ను దాటవేసినందుకు డ్రైవర్ మరియు కండక్టర్ ఇద్దరినీ సస్పెండ్ చేశామని తెలిపారు.

