బిహార్లోని పూర్నియా జిల్లాలో 100 మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సంయుక్తంగా ఈ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరించిన సందర్భంగా సంప్రదాయంగా వస్తున్న హవనం, యాగం, లాంటి ఆచారాలను నిర్వహించారు. అంతేకాకుండా శుద్ధీకరణ కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ‘‘హమ్ క్రిస్టియన్ నహి రహే’’అంటూ నినాదాలు చేశారు.
పూర్నియా ప్రాంతంలోని చుట్టుపక్కల వున్న గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. తమర్ని మిషనరీలు అనేక ప్రలోభాలకు గురి చేశారని, సనాతన ధర్మాన్ని వీడమని తమకు పదే పదే చెప్పేవారని వెల్లడించారు.
ఇక.. వీహెచ్ పీ జార్ఖండ్ ధర్మ ప్రచార ప్రముఖ్ ఉపేంద్ర కుష్వాహ మాట్లాడుతూ క్రైస్తవ మిషనరీలు అమాయకులైన ప్రజలను ఆర్థిక సాయంతో, సామాజిక సమీకరణాలతో అనేక మందిని ఆకర్షించారని, ప్రలోభాలకు గురి చేశారని మండిపడ్డారు. అలాగే ప్రజలను తప్పుదారి పట్టించి, భారతీయ మూలాల నుంచి దూరం చేశారన్నారు. వారు చెప్పినవన్నీ వట్టి మాటలే అని తెలుసుకొని, హిందూ ధర్మంలోకి తిరిగి వచ్చేయాలని ప్రజలే నిర్ణయించుకున్నారన్నారు.

.gif)