![]() |
| Hindu man beaten, tied to a tree, and set on fire by mobs in Bangladesh |
బంగ్లాదేశ్ లో మళ్లీ హిందువులపై హింస ప్రారంభమైంది. ఈనెల 18 న రాత్రి సమయంలో మైమెన్ సింగ్ లోని భలుకా అనే ప్రాంతంలో దైవ దూషణ చేశాడంటూ ఆరోపిస్తూ ఛాందసులు హిందువైన దీపు చంద్ర దాస్ ను దారుణంగా ఓ గుంపు కొట్టి చంపేశారు.దీంతో స్థానిక సమాజం తీవ్రమైన షాక్ లోకి వెళ్లిపోయింది. స్థానికంగా ఓ వస్త్ర కారాగారంలో పనిచేస్తున్నాడు.
రాత్రి 9 గంటల సమయంలో దైవ దూషణ చేశాడని ఆరోపిస్తూ, మూక సమూహం కొట్టి చంపేసింది. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని చెట్టుకు కట్టి, నిప్పంటించారని ప్రత్యక్ష సాక్ష్యులే తెలిపారు.
While above 5 crore illegal Bangladeshi & Rohingyas are living in India due to votebank politics, this is the situation of minority Hindus in Bangladesh
— Baba Banaras™ (@RealBababanaras) December 19, 2025
Throw all illegal Bangladeshis & Rohingyas from India, create a new country for Bangladeshi Hindus or give them citizenship. pic.twitter.com/NYBrXZTMVH
ఈ ఘటన జరగ్గానే సంఘటనా స్థలికి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. దీపు చంద్రదాస్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని, పంచనామా కోసం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అసలు ఘటన ఎందుకు జరుగుతుందో అధ్యయనం చేస్తున్నామని, దాడి చేసిన వారిని గుర్తించే పనిలో వున్నామన్నారు.
దీనిపై హిందువులు కూడా తీవ్రంగానే స్పందించారు. ఇది అత్యంత దారుణమైన ఘటన అని, హిందువులపై దాడులు దిగడం మళ్లీ ప్రారంభమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు.
విద్యార్థి నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హత్య జరిగింది. దీంతో బంగ్లాలో మళ్లీ అశాంతి రేగింది. ఈ సమయంలోనే దీపు చంద్రదాస్ హత్య జరగడం గమనించాల్సిన అంశం.
హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. పరిసంథితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో బంగ్లాదేశ్ లో ఆగ్రహ జ్వాలలు ప్రారంభమయ్యాయి. ఢాకా యూనివర్శిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భారత్, అవామీలీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా కార్యాలయాలకు, అవామీలీగ్ కార్యాలయాలకు నిప్పు పెట్టారు.

