భారత్ ను శక్తిమంతమైన దేశంగా తీర్చిదిద్దాలని, అందుకు ప్రజలంతా సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు.హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కీలక సూచనలు చేశారు. ‘‘దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత’’ అనే నినాదంతో ప్రజలందరూ తమదైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభం,అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశధ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని, అందుకు అనుగుణంగా ప్రజలు కూడా మారాలని,దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని ప్రధాని అన్నారు.
1. ఏడాది పాటు బంగారం కొనవద్దు :
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే క్రమంలో కనీసం ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా వుండాలని సూచించారు. దీని వల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది.
2.పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి :
ముడి చమురు దిగుమతులపై భారాన్ని తగ్గించేందుకు, పర్యావరణ రక్షణ కోసం వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించి, ఇంధనాన్ని ఆదా చేయాలి.
3. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి :
కాలుష్య రహిత భారత్ కోసం సంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని, పర్యావరణ హితమైన రవాణాకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
4.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగ్స్ :
ప్రయాణ ఖర్చులు, సమయాన్ని ఆదా చేసేందుకు, వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుసరించాలని, సమావేశాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహించుకోవాలి.
5. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి :
దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి, విదేశాలకు తరలిపోయే ధనాన్ని అరికట్టడానికి విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలి.
6. వంట నూనెల వినియోగం :
ఆరోగ్యపరంగా, దిగుమతి భారం తగ్గించే ఉద్దేశంతో వంట నూనెల వినియోగంలో పొదుపు పాటించాలి.
7. రసాయనిక ఎరువుల వాడకం :
నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడడానికి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రసాయనిక ఎరువుల వాడకాన్ని క్రమంగా తగ్గించుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
8. సోలార్ పంపులు :
వ్యవసాయ రంగంలో విద్యుత్ ఆదా కోసం సోలార్ పంపు సెట్లను వినియోగించాలని ,తద్వారా పునరుత్పాదక ఇంధన వనరుల వైపు అడుగులు వేయాలని సూచించారు.
9. స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యం:
స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా దేశీయ పరిశ్రమలను, చేతివృత్తుల వారిని ఆదుకోవాలని, ‘‘వోకల్ ఫర్ లోకల్’’ మంత్రాన్ని పాటించాలని కోరారు.
10.ఆడంబరాలు తగ్గించాలి :
మధ్య తరగతి కుటుంబాలు అనవరసరపు ఖర్చులను, ఆడంబరాలను తగ్గించుకొని, పొదుపు వైపు మొగ్గు చూపాలి. ఆర్థికంగా స్థిరపడాలి.

