భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మత మార్పిళ్ల కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. యూపీలోని ఘాజీపూర్ లో ఈ ఘటన జరిగింది. దీంతో బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్న నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.వాగ్దానాలు, మత ప్రబోధాల ద్వారా, స్వస్థత కూటముల ద్వారా ప్రజలను ఆకర్షిస్తున్నట్లు తేలింది. మరీ ముఖ్యంగా షెడ్యూల్డ్ తెగల వారిని ప్రలోభపెట్టి, క్రైస్తవంలోకి మారస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.
నిజానికి రెండు రోజుల క్రితం గ్రామంలో మత మార్పిడి కార్యక్రమం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అరెస్టుల దాకా దారితీసింది.
పోలీసుల కథనం ప్రకారం భీమ్ ఆర్మీకి సంబంధించిన బ్యానర్లు, పోస్టర్లతో ఈ కార్యక్రమం నడుస్తోందని, ఈ స్థలంలోనే మత మార్పిళ్లకు, ప్రలోభాలకు తెరతీశారని, దీంతో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
హిందూ మతాన్ని విడనాడి, క్రైస్తవ మతాన్ని స్వీకరించాలని నిందితులు గ్రామస్తులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
అరెస్టు చేసిన నిందితులను, జంగీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవకథియా గ్రామానికి చెందిన పాస్టర్ రమేష్ కుమార్ చంచల్ మరియు కోత్వాలి ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాఫర్పూర్కు చెందిన ధనాయిగా పోలీసులు గుర్తించారు.

