హిందువులకు వ్యతిరేకంగా, దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, బెదిరింపులకు దిగుతున్న బంగ్లాదేశీ ఇస్లామిక్ ప్రబోధకుడి వీడియో వైరల్ అవుతోంది. బయటి దేశంలో వున్న ఇస్లామిక్ వ్యక్తి, భారత్ లోని హిందువులను బెదిరించడం ఏంటని జాతీయవాదులు మండిపడుతున్నారు.'ఇన్సాఫ్ కాయేమ్కారి ఛాత్ర శ్రామిక్ జనతా' అనే తీవ్రవాద సంస్థ నాయకుడిగా పేరొందిన ఇస్లామిక్ ప్రబోధకుడు, హిందూ సమాజాన్ని, పలువురు రాజకీయ నేతలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.పాక్ ముస్లింలు, భారతీయ ముస్లింలతో భారత్ పై దాడి చేయాలని పిలుపునిచ్చారు. భారత్ పై విషం గక్కారు.
‘‘పాక్, భారత్ లోని ముస్లింల మద్దతుతో భారత్ ని మూడు గంటల్లో స్వాధీనం చేసుకోవచ్చు.భారత్ పై దాడి చేయాలి. ఇన్షా అల్లాహ్. పాక్ కి పిలుపునిస్తున్నా. భారత్ ని స్వాధీనం చేసుకోవడానికి మాకు మూడు గంటల సమయం కూడా పట్టదు. భారత్ లోని 26 రాష్ట్రాలూ నుజ్జు నుజ్జు అవుతాయి. ఇందుకు భారత్ లోని ముస్లింలే సరిపోతారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ముస్లింలకు కోపం వస్తే, భారత్ లోని హిందువులు మనుగడ సాగించలేరని ముస్లిం ప్రబోధకుడు ప్రగల్భాలు పలికారు."40 కోట్ల మంది ముస్లింలు ఆగ్రహిస్తే, భారతదేశంలోని హిందువులు జీవించలేరు," అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.

