ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలుగా బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నట్లు భారీ ఫిర్యాదులు అందాయి. దీంతో ప్రభుత్వం ఆమెను వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బలోడాలోని 'PM శ్రీ ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాల' ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించిన లక్ష్మీ దేవి భరద్వాజ్.. బలవంతపు మత మార్పిళ్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.దీంతో విద్యాశాఖ అంతర్గత విచారణకు ఆదేశించింది. దీంతో అసలు విషయం తేలడంతో ఆమెను సస్పెండ్ చేశారు.
జంజ్‌గిర్-చంపా జిల్లా విద్యాధికారి (DEO) జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం, విద్యార్థులలో క్రైస్తవ ఆచరణలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ పలువురు గ్రామస్తులు మరియు తల్లిదండ్రులు భరద్వాజ్‌పై ఫిర్యాదు చేశారు.
ఉదయం ప్రార్థన సమయంలో జనగణమనకు బదులుగా మన"కు బదులుగా "God is Great" మరియు "Hallelujah" వంటి పాటలను పాడాలని ఆమె పిల్లలను తీవ్ర ఒత్తిళ్లకు గురి చేసేవారు. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని తీవ్రంగా అగౌరవపరిచేవారంట ఫిర్యాదులు అందాయి. అలాగే పాఠశాల నిధులను కూడా దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులు అందాయి.
హిందూ ఆచారాలు, దేవతలను విమర్శించడం ద్వారా హిందూ వ్యతిరేక భావాలను ప్రోత్సహిస్తున్నారని కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
గతంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి...
1. జూలై 21,2025
తన ఇంటి నుంచే అక్రమ మత మార్పిళ్లు ప్రోత్సహిస్తున్నారంటూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై కేసులు నమోదయ్యాయి. అరుంధతి సాహూ అనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా వుంటూ అక్రమ మత మార్పిళ్లు ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదులు అందాయి.
2. జూన్ 21, 2025
మధ్యప్రదేశ్ లోని సోన్ కుచ్ ప్రాంతంలో అక్రమ మత మార్పిళ్ల కేసు వెలుగులోకి వచ్చింది. నిరుపేద గిరిజన పిల్లల కోసం ఒక శిక్షణా తరగతి ముసుగులో నడుస్తున్న శిక్షణా తరగతుల ముసుగులో అక్రమ మత మార్పిళ్లు చేస్తున్నారు. గిరిజన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసి, క్రైస్తవంలోకి వచ్చేలా చేస్తున్నారు. దీంతో నిర్వాహకులపై కేసులు నమోదయ్యాయి.అలాగే హిందూ దేవుళ్లను కూడా కించపరుస్తున్నట్లు శిక్షణా తరగతులకు హాజరైన విద్యార్థులు పేర్కొన్నారు.
3. 2023, జూన్ 1
ప్రభుత్వ బాలుర వసతి గృహంలో క్రైస్తవ మత ప్రార్థనలు చేయాలని తీవ్రంగా బలవంతం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మధ్యప్రదేశ్ లోని బాలల వసతి గృహాలపై దాడులకు దిగాయి. క్రైస్తవ మత ప్రార్థనలే చేయమని పిల్లలపై ఒత్తిళ్లు తెస్తున్నారని, దేవాలయాలు సందర్శించకుండా నిరోధిస్తున్నారని పేర్కొన్నారు.నిందితులు జెరాల్డ్ అల్మిడా మరియు లీజీ జోసెఫ్‌లపై జువైనల్ జస్టిస్ చట్టం, 2015లోని సెక్షన్ 75 మరియు మధ్యప్రదేశ్ మత స్వేచ్ఛా చట్టం, 2021లోని సెక్షన్లు 3/5 కింద కేసులు నమోదు చేశారు.
4.జూలై 29,2023
మధ్యప్రదేశ్ లోని కొన్ని మిషనరీ పాఠశాలలో చైల్డ్ కమిషన్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భారీ సంఖ్యలో బైబిల్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా విద్యార్థుల ఇంటిపేర్లను కూడా మార్చేస్తున్నారు. ఇవన్నీ కూడా గిరిజన ప్రాంతాల్లోనే నడుస్తున్నాయి.

