రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ‘‘కార్యకర్త వికాస వర్గ- తృతీయ’’ శిక్షా వర్గ నాగపూర్ కేంద్రంగా ప్రారంభమైంది. దాదాపు 800 మంది స్వయంసేవకులు హాజరయ్యారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ లో జన్మించడం, సంఘ్‌తో అనుబంధంతో స్వయంసేవకులుగా మారడం, అలాగే సంఘ కార్య శతాబ్దిలో కార్యకర్త వికాస వర్గ- ద్వితీయలో పాల్గొనడం మనకు లభించిన గొప్ప అదృష్టం అని అన్నారు.
సంఘ్ తన వందేళ్ల ప్రస్థానంలో ఎన్నో అవమానాలను, నిర్లక్ష్యాన్ని కూడా ఎదుర్కుందని, ఏకంగా మూడు వేర్వేరు సందర్భాలలో నిషేధానికి కూడా గురైందన్నారు. అయితే.. స్వయంసేవకుల అంకితభావం, పోరాటం, త్యాగాల ద్వారా మాత్రమే ఈ వందేళ్ల ప్రస్థానం సాధ్యమైందన్నారు.
సంఘ్ చేపట్టిన వ్యక్తి నిర్మాణం అనే ప్రక్రియ వికేంద్రీకరణతో కూడుకుందని, ఈ వ్యక్తి నిర్మాణ ప్రక్రియలో సంఘ్ నిర్వహించే దైనందిన శాఖ కూడా ఓ కీలకమైన అంశమన్నారు.'సంఘ్ శిక్షా వర్గ్' కూడా వ్యక్తిత్వ నిర్మాణ లక్ష్యాన్ని నెరవేరుస్తుంది. సంఘ్ శిక్షా వర్గ్ మొట్టమొదటగా 1927లో ప్రారంభమైందన్నారు.
అయితే.. కాలక్రమేణా ఈ వర్గల పద్ధతి, స్వరూపం పరిణామం చెందుతూ వస్తోందని, అయినా.. భారత్ ఓ హిందూ రాష్ట్రం అనే దృఢ విశ్వాసం, పరమ వైభం సాధించేందుకు యావత్ సమాజాన్ని సంఘటితం చేయాలన్న లక్ష్యం, సామాజిక ఐక్యతను సాధించే సాధనంగా శీల నిర్మాణ ప్రక్రియ అనే ఈ మూడు ప్రాథమిక సూత్రాలు మాత్రం మారకుండా ఉన్నాయన్నారు. అయితే.. సంఘ్ పుట్టిన స్థలమైన నాగపూర్ లోనే తృతీయ వర్ష నడుస్తుందని, దీని దృష్ట్యా దీనికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడిందన్నారు.
శారీరిక సంసిద్ధతతో పాటు మానసిక సంసిద్ధత కూడా అంతే అవసరమని, ఈ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికే వర్గ రూపొందించారన్నారు. అయితే.. ఈ వర్గ కాలాన్ని సాధ్యమైనంత వరకూ ఉత్తమంగానే ఉపయోగించుకోవాలని, వర్గ శారీరిక శిక్షణను ,మేధో వికాసంతో మేళవించి, ఓ విక్షణమైన అనుభవాన్ని అందిస్తుందన్నారు.

