రోడ్లపై నమాజ్ చేయడాన్ని తాము సహించమని, అనుమతి లేదని యూపీ సీఎం యోగి తాజాగా తేల్చి చెప్పారు.ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తూ వీధుల్లో నమాజ్ లేదా ఇతర మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడాన్ని తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని తేల్చి చెప్పారు. 'రోడ్లు ప్రయాణాలకే కానీ తమాషాలకి కాదు' అని తేల్చి చెప్పారు.
"మీకు నమాజ్ చదవడం అంత ముఖ్యమైతే ప్రార్థనలను నిలిపి వేయమని మేం చెప్పడం లేదు. కానీ దాన్ని వీధుల్లో కాకుండా షిఫ్టుల పద్ధతిలో ప్రార్థనా మందిరాల్లోనే చేసుకోండి. ముందుగా ప్రేమతోనే చెప్తాం. వినకపోతే మాత్రం చట్టాన్ని అమలు చేయడానికి ఇతర పద్ధతులను అవలంబించాల్సి వస్తుంది" అని హెచ్చరించారు.
దీంతో బహిరంగంగా నమాజ్ చేసే అంశం మరో సారి తెరపైకి వచ్చింది. అయితే... గల్ఫ్ దేశాల్లోనే బహిరంగ ప్రదేశాల్లో, రోడ్లపై నమాజ్ చేయడం నిషేధం వుంది. ట్రాఫిక్, పాదచారుల భద్రత, ప్రజా శాంతిని కాపాడడానికే ఈ నిషేధం అమలులో వుంటుందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.
1. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ : ఇక్కడ కూడా రోడ్లపై నమాజ్ చేయడం చట్ట విరుద్ధం. అబుదాబి దీనికి AED 1,000 జరిమానా విధిస్తుండగా, దుబాయ్ AED 500 జరిమానా విధిస్తుంది.
2.సౌదీ అరేబియా: ఈ ప్రాంతంలో కూడా రోడ్లపై, బహిరంగంగా నమాజ్ చేయడాన్ని నిషేధించారు. అలాగే ప్రార్థనలు చేసే సమయంలో పరిచే చాపను పరచడం కూడా చట్ట విరుద్ధం. ప్రార్థన కోసం ఆగి, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే కఠినమైన జరిమానాలు విధించబడతాయి.
3.కువైట్: రద్దీ సమయాల్లో లేదా శుక్రవారం ప్రార్థనల వేళల్లో ప్రార్థనలు వీధులు లేదా బహిరంగ ప్రాంగణాల్లో నమాజ్ చేయడం నిషేధించారు.
4. ఫ్రాన్స్ : రోడ్లపై, వీధుల్లో సామూహిక ముస్లిం ప్రార్థనలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

