![]() |
| These are the decisions taken by the Karnataka Congress government to appease Muslims. |
కర్నాటక ముస్లిం సంఘాలు సమావేశమై, అత్యంత సంచలనమైన డిమాండ్లను ప్రభుత్వం ముందు వుంచాయి. దీంతో యావత్ సమాజం విస్తుపోయేలా ఈ డిమాండ్లు వున్నాయి. ఈ నెల 17 న బెంగళూరులోని టౌన్ హాల్ లో 48 ముస్లిం సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా తమ కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని, రిజర్వేషన్ కోటాల పునరుద్ధరణ చేయాలని, అలాగే మత మార్పిడి నిరోధక, పశు వధ నిషేధ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్లు చేశారు. వీటన్నింటితో కూడిన డిమాండ్లతో ప్రభుత్వానికి ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. దీంతో కర్నాటకలో పెద్ద రాజకీయ దుమారమే రేగుతోంది.
అయితే.. ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా ముస్లింల సంతుష్టీకరణ కోసం ఏం చేసిందో కొన్నింటిని చూద్దాం........
ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం....
కొన్ని రోజుల క్రితం ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ సరైన రాజ ధర్మాన్ని నిర్వర్తించలేదు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం కూడా లభించింది. 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. కర్నాటక అభివృద్ధిలతో భాగంగా లక్ష కోట్ల అభివృద్ధి పనులకు కర్నాటక సర్కార్ నిర్ణయించింది. దీని కోసం ప్రాజెక్టుల కోసం చేసే కాంట్రాక్టుల్లో 2బీ కేటగిరీ కింద ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది.
ఇందు కోసం KTPPA (KARNATAKA TRANSPERENCY IN PUBLIC PROCUREMENT ACT 1999) చట్టంలో సవరణ కూడా చేసింది. ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలు చేసి, హిందువులకు తీవ్ర అన్యాయం చేసింది. కర్నాటక ప్రభుత్వం గెలవడంలో హిందువుల పాత్ర కూడా వుంది. కాంట్రాక్టుల్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని జాతీయవాదులు మండిపడుతున్నారు.
ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు : కేబినెట్ నిర్ణయం
కర్ణాటక కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై కొన్ని పథకాల్లో ముస్లింలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించనుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయించింది. ముస్లింలకు ప్రత్యేక కోటా మంజూరు చేసింది. ర్ణాటకలో ప్రభుత్వం తలపెట్టిన గృహ నిర్మాణ పథకాల్లో ముస్లింలకు ప్రత్యేక కోటా ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఉన్న 10 శాతం రిజర్వేషన్లను 15 శాతానికి పెంచుతూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణాభివృద్ధి శాఖలు అమలు చేసే హౌసింగ్ పథకాలకు ఈ 15 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. మైనార్టీ వర్గాలకు ప్రస్తుతం 10 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. త్వరలో వీటిని 15 శాతానికి పెంచనున్నారు.
మైనారిటీ నివాసిత ప్రాంతాల అభివృద్ధి కోసం 600 కోట్ల కార్యాచరణ...
కర్నాటకలోని ముస్లింలను మరింత సంతుష్టీకరణ చేయడానికి సిద్దరామయ్య ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ నివాస ప్రాంతాల అభివృద్ధి కోసం కర్నాటక ప్రభుత్వం 600 కోట్ల కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది.దీనిని కేబినెట్ కూడా ఆమోదించింది.ముఖ్యంగా దావణగెరె దక్షిణ నియోజకవర్గంలో టికెట్ల కేటాయింపుకు సంబంధించి తలెత్తిన వివాదం పట్ల మైనారిటీ వర్గాల్లోని కొన్ని వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చర్య చేపట్టారు.
అభివృద్ధి చెందని మైనారిటీ ప్రాంతాలలో రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థలు, వీధి దీపాలు, పారిశుధ్య సౌకర్యాలు, తాగునీటి సరఫరా మరియు ప్రజా మౌలిక సదుపాయాలు వంటి ప్రాథమిక పౌర సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈ నిధులను వినియోగించనున్నారు.
విద్య, స్కాలర్ షిప్పుల కోసం 150 కోట్లు
- ఆరోగ్యం, మౌలిక సదుపాయాల కోసం 100 కోట్లు
- మౌలికసదుపాయాల అభివృద్ధి 200 కోట్లు
- స్కిల్ డెవలప్ మెంట్, ఉపాధి : 100 కోట్లు
- ఇళ్ల నిర్మాణం : 30 కోట్లు
- కమ్యూనిటీ ఎంపవర్ మెంట్ :20 కోట్లు
ఇలా వివిధ అవసరాల కోసం ముస్లిం కోసం 600 కోట్లను కేటాయిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం సంతుష్టీకరణ రాజకీయాలు చేస్తోంది.

