అనుబంధం, సేవ - మనదృష్టికోణము - RSS Seva

సేవ
సవ

అనుబంధం
సేవ - మనదృష్టికోణము 
   సేవ అంటే హిందూ ఆలోచనా విధానంలో నిస్వార్థము కర్తవ్యము, పూజ్యభావంతో పీడితులు, పేదల వికాసానికి తద్వారా సమాజ పరివర్తన కొరకు చేసేది. ఇది ప్రతి వ్యక్తికి ఉండాల్సిన సహజధర్మం. లుప్తమై పోయిన ఈ భావాన్ని తిరిగి వ్యక్తులలో నింపే కార్యమే శాఖ-సేవ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయంసేవక్ అనే పదంలోనే 'సేవ' వున్నది.
   హిందూ సమాజం అనేక వర్గాలుగా విభజించబడి వుంది. భేద భావాలు పెరిగిపోతున్నాయి. ఆర్థిక సమానత విద్య పెరిగినంత మాత్రాన భేద భావాలు తొలగి సామాజిక పరివర్తన రాదు. శాఖద్వారా స్వయంసేవకులు చేసే చిన్నచిన్న సేవా కార్యక్రమాల ద్వారా సాధ్యం అవుతుంది. సేవాహి పరమోధర్మ: అనేది అనాది కాలం నుంచి మనదేశంలో పాటిస్తున్న విషయం. ఇక్కడ ధర్మం అనగా కర్తవ్యం, అనగా తప్పక చేసి తీరవలసింది.
  భారతదేశం ఎంత ప్రాచీనమైనదో సేవా పరంపర కూడా అంతే ప్రాచీనమైనది. సేవ అనే పదం చాలా ప్రచారమైంది. ఆంగ్లంలో 'సర్వీస్' అని అనువాదం చేశారు. ఎంత తరచిచూసినా ఈ రెండు పదాలమధ్య సంబంధం కనబడదు. దురదృష్ట వశాత్తు మనదేశ ప్రజలు చాలా మంది పాశ్చాత్యదేశాలను గ్రుడ్డిగా అనుకరిస్తున్నందు వలన పవిత్రమైన  'సేవ' అనే పదం యొక్క అర్థం కూడా అనర్థంగా మారిపోయింది. కొంతమంది పేదరికాన్ని ఆసరాగా చేసుకొని లేదా ప్రలోభపెట్టి సహాయంచేసి దానికి బదులుగా మతం మార్పిడి చేయడం కూడా సేవగా భావిస్తున్నారు. ఇది సేవ కాదు. ఉద్యోగం చేయడాన్ని సేవ అని చెప్పబడుచున్నది. 
   అలాగే వినియోగదారులకు కూడా సేవ చేస్తున్నామని వ్యాపారస్థులు అంటుంటారు. కొందరు పేరు ప్రతిష్టలకు, రాజకీయ లాభం కొరకు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. డబ్బులు తీసుకొని పనిచేయడము, ఏదైనా ఆశించి సహాయం చేయడం సేవకాదు ఆవిధంగా సేవకు తప్పుడు అర్థాలు ప్రచారంలో ఉన్నాయి.
   సేవాకార్యం నిరపేక్ష, వినమ్ర భావాలతో కూడినదై వుండాలి. దీనికి చక్కటి ఉదా : ప్రకృతి, తల్లి, ఉన్నవాడు లేనివాడి పట్ల చూపే దయాగుణం కాదు. భగవంతుడు మాత్రమే ఉన్నవాడు. ఈ దయచూపే గుణం ఆయనకు మాత్రమే చెందుతుంది.
   ఆకలితో అలమటిస్తున్న పసివాడు మనకు కనబడినా లేదా ఎవరైనా ఆపదలో చిక్కుకొన్నా - భగవంతుడా ఇతనికి ఆవిధంగా ఎందుకు చేశావు, వచ్చి ఆదుకోరాదా? అనిగాని లేదా అతను పూర్వజన్మ పాపఫలితాన్ని అనుభవిస్తున్నాడులే అనిగాని మనం భావించకూడదు. ఆ సమయంలో భగవంతుడే మనకు ఆ రూపంలో కనబడి సేవించుకోవడానికి మనకు అవకాశం కల్పించాడని భావిస్తే సేవాభావనలోని అంతరార్థం మనకు తెలుస్తుంది. దరిద్ర దేవో భవ అనేది మన ఆరాధనా పద్ధతి. దు:ఖంతో బాధపడుచున్నవాడు తాను పూర్వజన్మంలో ఏపాపం చేసానో, ఇప్పుడిలా అనుభవిస్తున్నానని అనుకోవడం సహజం. కాని సేవించే వారి దృష్టి ఆరాధనాభావంతో నిండి వుండాలి.

   భక్తి యోగంలో సేవాభావనకు గొవ్పస్థానం కల్పించబడింది. ఉదా : 
1. ప్రహ్లాదుడు - నేనొక్కడినే ముక్తిని పొందడం కాదు. నాతోపాటు అందరిని ముక్తిని పొందడానికి పాటుపడతానని అంటాడు. 
2. రంతిదేవుడు - తానుమోక్షం కోరుకోకుండా అన్ని ప్రాణుల బాధలను పోగొట్టే గుణం కావాలని భగవంతుడిని అర్థిస్తాడు. 
3. స్వామివివేకానంద - ఒకసారి హితవాద పత్రిక సంపాదకులు దేవూస్కర్జీ తనమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొనేందుకు వచ్చినవ్పుడు వారితో ఆ నమయంలో కఱవుతో విలవిలలాడుచున్న ప్రజల బాధల గురించే స్వామిజీ గంటల తరబడి చర్చించారు. 
  అయితే తిరిగి వెళుతూ వచ్చిన పని కాలేదని, సమయం వృధా అయినదని వ్యక్తపరచిన వారితో స్వామీజీ కళ్ళల్లో అగ్నిని కురిపిస్తు "ఈ దేశంలో ఒక్క కుక్క పస్తువున్నా, దాని ఆకలి తీర్చడం నాధర్మం. మిగిలినదంతా అధర్మం” అని అన్నారు. దరిద్ర దేవో భవ అనే నూతనదిశను సేవాభావానికి కల్పించారు. దరిద్ర దేవో భవ అనే మాటకు క్రియా రూపంగా వారు స్థాపించిన రామకృష్ణ మఠం ధ్యేయవాక్యం 'ఆత్మనో మోక్షార్థమ్ - జగద్దితాయచ  (జగత్తుకు హితాన్ని కలిగించుట వలననే నాకు ముక్తి) భావం కూడ ఇదే. ఇతరులకు ఉపకారం చేయడం పరోపకారం కాదు, పరమేశ్వర ఆరాధనయే అవుతుందని కూడా వివేకానంద అంటారు. 
  సేవ అనేది భగవదారాధనగా రూపొందే ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. సేవాభావనలోని ఈ తత్వాన్ని అర్థం చేసుకొన్నప్పుడు మనం ఇతరులకు ఇచ్చేది యావత్తు భగవంతునికే అనగా తనకే (ఆత్మకే) ఇచ్చుకొంటున్నట్లు అనుభవంలోకి వస్తుంది. తన పై తనకు ప్రేమ ప్రతి వ్యక్తిలో వుంటుంది. తన ప్రతిరూపాలుగా కనబడే ఇతరులను ఎంతగా ప్రేమిస్తుంటే అంతగా వ్యక్తికి ఆనందం, అనుభూతి కలుగుతుంది.
   ఈ లోకంలో అందరూ నీకు ప్రియమెందుకు అవుచున్నారు? అన్న ప్రశ్నకు వారియందు నాకు ఉన్న ప్రేమకారణంగానే అని బృహదారణ్యక ఉపనిషత్తు ఉపదేశిస్తున్నది. ఈ దృష్టి కోణంతో వ్యక్తి సేవా తత్పరుడైతే కుటుంబం స్వర్గతుల్యం కావడంతోపాటు దేశం అన్ని రంగాలలో అభివృద్ది (సర్వాంగీణ ఉన్నతి)ని సాధిస్తుంది. పాశ్చాత్యుల దృష్టిలో 'వికాసం' అంటే అభివృద్ధి మాత్రమే
కాని మన కల్పనలో వికాసం అంటే పరమవైభవస్థితి. ఈ ఆలోచనా విధానాన్ని సాధించడంకోసమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో సేవావిభాగం ఏర్పడింది.

    స్వయంసేవకులు సేవచేసేటప్పుడు సామాజిక పరివర్తనతో పాటు తనలోకూడా పరివర్తన తెచ్చుకొనే సంస్కారాన్ని పొందుతూ వుంటారు. నరసేవ నారాయణ సేవ అనే భగవదర్పణ బుద్ధి తమలో ఎల్లవేళలా జాగృతమవుతూ వుండాలనేదే స్వయంసేవకులు పొందే సంస్కారం. ఇన్ని సంవత్సరాలుగా తమసోదరులపట్ల సమాజం చూపిన ఉపేకా భావానికి, భేద భావానికి, అన్యాయానికీ సరైన పరిష్కారం. సేవాకార్యమేనని సేవాకార్యంలో పాల్గొనే స్వయంసేవకులు భావిస్తుండాలి.
  ఈవిధంగా మన ఆత్మసంస్కారంకొరకు చేసే ఆధ్యాత్మిక సాధనగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఈకృషిని నిరంతరం కొనసాగించాలని పరమ పూజనీయ గురూజీ స్వయంసేవకులకు పిలుపునిచ్చారు. వారి అనంతరం తృతీయ సర్ సంఘచాలక్ పరమపూజనీయ బాలాసాహెబ్ దేవరస్జీ సమాజంలో ఉపేక్షింపబడుచున్న మన సోదరుల గురించి స్పందిస్తూ 'అంటరానితనం పాపం, అది పాపం కాకపోతే ప్రపంచంలో మరేదీ పాపంకాదు' అని అన్నారు. 
  పూజనీయులైన ముగ్గురు సర్సంఘచాలకులు సేవా కార్యానికి సంబంధించిన విషయంలో సందర్భానుసారంగా మార్గదర్శనం చేసియున్నారు. 
  ప.పూ.గురూజీ: అనంతప్రేమ, దేశభక్తికి ప్రకటితి రూపమే సేవ. ప.పూ. బాలాసాహెబ్ దేవరస్జీ : సంఘం కేవలం దండ, గణవేశ్, పథసంచలన్ లేదా శారీరక కార్యక్రమాలు నిర్వహించుటకే పరిమితం కాకుండా సమర్పణ గల వ్యక్తుల నిర్మాణం చేయు ఒక సంస్థగా గుర్తింపు పొందాలి. శాఖ పనికి కొనసాగింపే సేవాకార్యక్రమాలు. 
  ప పూ. ప్రొఫెసర్ రజ్జుభయ్యా : కొన్ని సంవత్సరాలుగా శాఖ నడుస్తున్న పల్లెల్లోను, నగరాలలోని బస్తీలలోను శాఖ కారణంగా సమాజ పరివర్తన జరగాలి. కొద్దిమంది కష్టాలను దూరం చేయడమే సేవాకార్యం ఉద్దేశ్యం కాదు. సేవా మాధ్యమం ద్వారా సమాజంలో సోదరభావం అంటే సమరసత ఉత్సన్నం కావాలని మనకోరిక. సమతాయుక్త, శోషణముక్త సమాజ నిర్మాణమే సంఘధ్యేయం.
  ఉత్తమ ఆలోచనలతో మహెూన్నత స్థితిని సాధించవచ్చును. ఈదృష్టితోనే భారతదేశంలో 'వసుధైవ కుటుంబకమ్' అనే విశాలమైన ఆలోచనా విధానం ఏర్పడింది. ఈ విశాల భావనతోనే ప్రపంచాన్ని ఏకం చేసేందుకు 'సేవ ధర్మం - కర్తవ్యం' అనే మూడు పదాలను అర్ధం చేసుకోవడం ఎంతైనా అవసరం.
  అయితే నేడు భారతీయుల ఆలోచనా విధానానికి పాశ్చాత్యుల ఆలోచనా విధానానికి సంఘర్షణ ఏర్పడి ఉంది. ఈ రెండింటి మధ్యలో ఎంతో తేడా ఉంది. పాశ్చాత్యుల ఆలోచనలు మనిషిని ఆర్థికప్రాణిగా, భోగలాలనునిగా చేస్తున్నాయి. ఇట్టి మనిషి ఏనాడూ అమృతత్వాన్ని పొందలేడు. భారతీయ జీవన విధానంలో అర్థ, కామాలు అనేవి ధర్మ - మోక్షాల మధ్య బంధించబడతాయి. ఈ కారణంగా మనిషి వినాశనం నుండి వికాసం వైపు, మృత్యువు నుండి అమృతత్వం వైపు వెళ్తాడు.
   మనిషిలోని మానవత్వంయొక్క స్వాభావిక ఆవిష్కారమేసేవ. మనిషిగా తయారయ్యే సహజప్రవృత్తి సేవ అభాగ్యులను శక్తివంతులుగా చేసేదిసేవ. సేవ అందుకొనే వ్యక్తిలో కూడా తాను బలోపేతుడను కావాలని, అలాగే తన కన్నా బలహీనులను కూడా బలోపేతం చేయాలనే భావనను సేవద్వారా అతనిలో కలిగించాలి. 
   సేవయే జీవనం, సేవయే సమర్పణం. మన తోటివారి మంచికోసం జీవించుటయే జీవన దర్శనం. దీనికోసం సమాజంలో బంధుత్వ భావాన్ని, సామరస్య భావాన్ని సేవాభావాన్ని, కర్తవ్య భావాన్ని నింపాలి. ఉపేక్షించబడిన పీడించబడిన, అణచివేయబడిన మన బలహీన సమాజాన్ని దర్శించాలి. 'తోటివారి సుఖంలోనే నా సుఖముంది, తోటివారికి సుఖాన్ని కలిగించుటే నా కర్తవ్యం, మనమంతా ఒక విశాల కుటుంబ సభ్యులం' అనే భావాన్ని జాగృతం చేయాలి. 'సేవ' ను సమాజ స్వభావంగా, ఒక మహెూద్యమంగా రూపొందించే ప్రయత్నం చేయాల్సి ఉంది.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం


{full_page}
***
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top