"స్వేచ్చ, సమానత్వం, భ్రాతృత్వాలతోకూడిన మానవత మన ఆదర్శం": డా. మోహన్ భాగవత్ జీ - రెండవ రోజు ఉపన్యాసము - Freedom, equality and humanity is our ideal

0
డా. మోహన్ భాగవత్ జీ
డా. మోహన్ భాగవత్ జీ
స్వేచ్చ, సమానత్వం, భ్రాతృత్వాలతోకూడిన మానవత మన ఆదర్శం !
   ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ భూభాగాన్ని, రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, జయించాలని మనం ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎవరి సంపదను దోచుకోలేదు. ఎక్కడికి వెళితే అక్కడ జ్ఞానాన్ని పంచాము. సభ్యతను అలవరచాం. ఇతర దేశాలనుంచి అనేకమంది ఇక్కడకు వచ్చి అనేక విషయాలు నేర్చుకుని జ్ఞానవంతులుగా తిరిగి తమతమ దేశాలకు వెళతారు. తాము ఇక్కడ పొందిన అనుభవాలు, అనుభూతులను తమ దేశంలో వారికి గొప్పగా చెప్పుకుంటారు. ఇలా ప్రాచీన కాలం నుంచి జరిగింది, ఇప్పటికీ అనేక దేశాల్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాలు లభిస్తాంయి. రామాయణ, మహాభారత కథలు వినిపిస్తాయి. రామ్లీలా కార్యక్రమాలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య సాగుతాయి. అక్కడ ఇప్పుడు బౌద్దులు లేరు. అంతా ముస్లిములే.
    కానీ తాము తమ పూర్వీకులను, వారి సంస్కృతినీ మరచిపోలేదంటారు. ఇలాంటి మధురమైన జ్ఞాపకాలు, విషయాలు భారతదేశానికి మాత్రమే ఎందుకు ఉన్నాయి ? ఎందుకంటే ఈ సంతులితమైన దృక్పథంతో అనుశాసనంతో భారత్ ప్రపంచంలోని అందరినీ సొంతవారిగానే భావించి, మన్నించింది. అందుకనే ఈ సుజల, సుఫల, మలయజశీతల అయిన మాతృభూమి మనకు ఏనాడ దండయాత్ర, దురాక్రమణ పాఠాలు నేర్పలేదు. నాలుగువైపుల నుంచి మన దేశానికి ప్రకృతి సహజమైన రక్షణ, భద్రత లభించింది. ఇప్పటిలా రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీనివల్ల మనం సురక్షితంగా, సమృద్దవంతంగా ఉన్నాం. అందువల్ల ఘర్షణ పడటం, యుద్ధాలు చేయడంపై మనకి ఎప్పుడూ దృష్టిలేదు. ఇక్కడకి బయటనుంచి ఎవరైనా వస్తే వారికి చక్కగా ఆశ్రయం ఇచ్చాం. ఇప్పటికే అనేక భాషలు ఉన్నాయి. అనేకమంది దేవీదేవతలు ఉన్నారు, ఇప్పుడు మీరు వచ్చినందువల్ల మరి కొంతమంది చేరుతారు అంతే అనే ధోరణిలో ఉండేవారం. మానవతా ధర్మాన్ని అనుసరించి జీవించండి అని చెప్పాం. 

    రాజ్యాంగంలో తాను పొందుపరచిన సమానత్వం, స్వేచ్చ, సౌభ్రాతృత్వ  భావాలను ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకోలేదని డా|| ఆంబేడ్కర్ స్పష్టం చేశారు. ఈ భూమిలోనే పుట్టిన తథాగతుని ఉపదేశాలు, సందేశాల నుంచి తీసుకున్నానని చెప్పారు. ఎందుకంటే స్వాతంత్ర్యం ఉన్నచోట సమానత్వం లభిస్తుందన్న హామీఏమీలేదు. అలాగే సమానత్వం ఉంటే స్వేచ్ఛను పరిమితం చేసుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటినీ ఒకేసారి సాధించాలంటే బంధుభావన తప్పనిసరి. ఆ బంధుభావనే ధర్మం. బంధుభావానికి ఆధారం ఏమిటి ? మన పూర్వజులు ఒకరే. మన సాంస్కృతిక వారసత్వం ఒకటే. మన మాతృభూమి కూడా ఒకటే అనే ఆలోచన.
    అందుకనే మేం చెప్పేది ఒకటే. ఇక్కడ ఉన్నవారంతా ఒకే జాతి అన్నది మా భావన. వారంతా హిందువులేనన్నది మా విశ్వాసం. దీనిని వ్యతిరేకించేవారు, ప్రశ్నించేవారూ ఉండవచ్చును. అది వారికున్న స్వేచ్ఛ. దానిని మేం ఎప్పుడూ కాదనం. ఇక్కడ ఉన్నవారంతా హిందువులేనని కొందరికి తెలుసు, వారంగీకరిస్తారు. కొందరికి తెలియదు కాబట్టి ఒప్పుకోరు. కొందరికి తెలిసినప్పటికీ రాజకీయ ప్రయోజనాలకోసమో, మరే ఇతర ప్రయోజనాలకోసమో బయటకు చెప్పరు. వ్యక్తిగతంగా ఒప్పుకుంటారు. మరికొందరు ఆ విషయమే మరచిపోయారు. వారు అలా మరిచిపోయేట్లుగా చేశారు. వీళ్ళంతా ఈ దేశస్థులే, ఈ భారతభూమికి చెందినవారే, మనవారే. మా దృష్టిలో వీరందరినీ సంఘటిత పరచడమే హిందూసంఘటన
    పరీక్ష వ్రాసేటప్పుడు సులభమైన ప్రశ్నలకు సమాధానం ముందు వ్రాసేస్తాం. తరువాత కఠినమైన ప్రశ్నలకు వెళతాం. అలాగే తాము హిందువులమని తెలిసి అంగీకరించినవారి సంఘటన ముందు చేస్తాం. ఆ తరువాత ఇతరులను కలుపుకుపోతాం. అంతేకానీ వారికి వ్యతిరేకంగాగానీ, వారిని వదిలిపెట్టిగానీ కాదు. ఒక ఉన్నతమైన జీవన వ్యవస్థను సృష్టించి వీరందరినీకూడా అందులో భాగస్వాములను చేస్తాం. ఎందుకంటే మాకు శత్రువులెవరూ లేరు. ఈ దేశంలోకానీ, ప్రపంచంలోకానీ, మాపట్ల శత్రుత్వం వహించేవారిని నాశనం చేయాలనుకోము. వారిని కూడా మాతోపాటు తీసుకునివెళ్ళాలనే అనుకుంటాము. ఇదే హిందుత్వం

    నేడు హిందుత్వంగా ప్రచారంలో ఉన్నదంతా ధర్మం కాదు. ధర్మభావన మహాభారత కాలం నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. దానిని సంకుచితపరచడంలో హిందూ సమాజపు పాత్ర కూడా ఉంది. విలువలను కర్మకాండలో బంధించడంవల్ల అనేక కురీతులు, మూధాచారాలు, అస్పృశ్యత వంటి పాపాలు హిందూ సమాజంలో ప్రవేశించాయి. ఈ లోపాలన్నీ పోయి దేశ, కాల, పరిస్థితులకు తగినట్లుగా సనాతన మానవ ధర్మం ఈ దేశంలో పునఃస్థాపితం కావాలని మేము కోరుకుంటాము. మన దేశంలోని సంప్రదాయాలు, మతాలన్ని విలువల ఆధారిత ఆచరణనే భోధించాయని మేము భావిస్తాం.  ఈ విలువలే సర్వత్రా ఆచరణలోకి రావాలి. వాటి ప్రకారం ఎవరినీ దూరం చేయం, ఎవరినీ దుష్టులుగా పరిగణించం. ఎవరిని కలిస్తే వారిని తీర్చిదిద్దుతాం.
   ఆ హిందుత్వం ఆధారంగానే సంఘం ఆలోచిస్తుంది. ఆలోచనలు వివిధ అంశాల ఆధారంగా సాగుతాయి. అందుకనే వాటి వ్యక్తీకరణ కూడా వేరువేరుగా ఉంటుంది. ఇంట్లో నలుగురు పిల్లలుంటే ఎవరికి తగినట్లుగా వారికి నచ్చచెప్పాల్సి ఉంటుంది. అందుకని కేవలం ఎవరో ఒకరు ఒకచోట చెప్పిన పద్దతిని మాత్రమే చూసి నిర్ధారణకు రాకండి. ఈ దేశం గురించి ఆలోచించిన వారందరి నిస్వార్టపూరితమైన సంకల్పాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం, కొత్తగా ఆలోచించవలసినది, సిద్ధాంతీకరించవలసినదీ ఏదీ లేదు.

- రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దృష్టికోణం -
డా. మోహన్ భాగవత్ జీ ఉపన్యాసం వీడియోలు.
మొదటి రోజు ఉపన్యాసం:

రెండవ రోజు ఉపన్యాసం:

మూడవ రోజు ఉపన్యాసం:

భవిష్యభారతం: ఆర్.ఎస్.ఎస్ సర్ సంఘ చాలక్ డా. మోహన్ భాగవత్ గారి ఉపన్యాస మాలిక ..

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top