భారతీయ కుటుంబంలో: నిత్యం చేయవలసిన 50 పనులు - Bharatiya family: 50 things to do regularly

Vishwa Bhaarath
0
ఒకప్పటి ఆనందకరమైన " ఉమ్మడి కుటుంబం "

కుటుంబానికి కరదీపిక
: మనం నిత్యం చేయవలసిన 50 పనులు :
 1. ఉదయం నిద్రనుండి లేచేటప్పుడు కుడిప్రక్కకు తిరిగి లేవండి. లేచిన వెంట్రనే రెండు అరచేతులను చూస్తూ.. " కరాగ్రే వసతే లక్ష్మీః, కరమధ్యే సరస్వతీ కరమూలేతు గోవిందః, ప్రభాతే కరదర్శనమ్ ” అనే శ్లోకాన్ని చెప్పండి.
 2. లేచిన వెంటనే కప్పుకున్న దుప్పటిని, పక్కబట్టలను అన్నిటినీ మడత పెట్టండి. 
 3. వెంటనే కాలకృత్యాలు పూర్తిచేయండి, కాలకృత్యాలు పూర్తయిన తరువాత చేతులను సబ్బుతోగాని
 4. ఎఱ్ఱమట్టితోగాని కడుక్కోండి.
 5. వృద్ధులు, మోకాళ్ళనొప్పులున్నవాళ్లు మాత్రమే కమ్మోడ్ (Commode) వాడండి.
 6. వాష్ బేసిన్లో నీళ్ళు ధారగావదలకుండా, అవసరమైనంత మాత్రమే ఉపయోగించండి.
 7. ముఖము, కాళ్ళు చేతులు కడుగుకొన్న తరువాత తుండుగుడ్డతో తుడుచుకోండి.
 8. ఉదయాన్నే ముందురోజు రాత్రి రాగిపాత్రలో పోసిఉంచిన నీటిని త్రాగండి.
 9. బాగా చెమటపట్టేట్లుగా యోగా సాధన, వ్యాయామం చేయండి లేదా కనీసం వాకింద్ (నడక)చేయండి.
 10. " గంగేచ యమునే చైవ, గోదావరి, సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు” అనే శ్లోకము చెప్పుకుంటూ స్నానం చేయండి. స్నానము తరువాత తలకు నూనె అంటి, మర్ధనము చేయండి.
 11. ఫాలభాగము (నుదుటి)పై ఏదైనా తిలకము లేదా కుంకుమ/ గంధము/ విభూతి దిద్దండి.
 12. దేవునిఎదుట కూర్చొని 4,5 నిమిషాలు ధ్యానంచేయండి. 
 13. భోజనము, అల్పాహారము చేసేటప్పుడు ప్ప్రశాంతంగా కూర్చొని తినండి. 
 14. నీళ్ళు త్రాగునపుడు కూర్చొని త్రాగండి.
 15. భోజనంచేసిన తరువాత పాత్రలను వెంటనే కడిగి తగిన ప్రదేశంలో ఉంచండి.
 16. ఇంటికి ఎవరైనా వస్తే మీరే ముందుగా ఎదురువెళ్ళి చిరునవ్వుతూ 'రండి', 'లోపలికి రండి' అని పిలవండి. లోపలికి వచ్చిన వారికి కూర్చోడానికి స్థలము చూపించి, 'మీరు క్షేమమా' మీ కుటుంబములోని వారందరూ క్షేమమే కదా’ అని క్షేమసమాచారములు అడగండి తర్వాత త్రాగడానికి మంచినీళ్ళివ్వండి. ఇచ్చేటప్పుడు గ్లాసును బయటవైపు పట్టుకోండి. గ్లాసులోని నీళ్లకు మీ వేళ్ళు తగలకుందడా జాగ్రత్తపడండి. మంచినీటిగ్లాసు ఇచ్చేటప్పుడు కుడిచేత్తోగాని, రెండుచేతులతోగాని ఇవ్వండి.
 17. ఏదైనా తీసుకొనేటప్పుడు కుడి చేత్తోగాని, రెండు చేతులతోగాని తీసుకోండి.
 18. మనకంటే పెద్దవారి నుండి వస్తువు తీసికొనేటప్పుడు రెండు చేతులతో తీసుకోవాలి.
 19. సన్యాసులనుండి ప్రసాదము స్వీకరించునపుడు రెండుచేతులపై ఒక వస్త్రాన్ని ఉంచి స్వీకరించాలి.
 20. స్త్రీలు కొంగును రెండు, భుజాలపై పూర్తిగా కప్పుకొని కొంగు అంచుతో ప్రసాదం స్వీకరించాలి.
 21. పెద్దవాళ్లు మన దగ్గరకు వచ్చినపుడు లేచి నిలబడాలి.
 22. ఆవులింత వచ్చినపుడు నోటికి జేబురుమాలును అడ్డుపెట్టుకోవాలి.
 23. తుమ్ము వచ్చినపుడు ముఖానికి రుమాలు అడ్డుపెట్టుకోవాలి.
 24. ముక్కులో వేలు పెట్టినట్లయితే, తీసిన తరువాత చేతిని కడుక్కోవాలి.
 25. భోజనముగాని, అల్పాహారముగాని వడ్డించేటప్పుడు దగ్గు లేదా తుమ్ములు వచ్చి చేతులు తడిస్తే, చేతులను వెంటనే కడుక్కోవాలి.
 26. మాట్లాడుకొనేటప్పుడు అక్కడలేని మనుషుల గురించి మంచిగా మాట్లాడాలి.
 27. మాటల్లో ఎదుటివారిని ఓడించడంకోసం మాట్లాడకూడదు.
 28. ఏదైనా చెప్పాలనుకొంటే సలహాలు చెప్పినట్లుగా ఆత్మీయంగా చెప్పాలి.
 29. ఇతరుల మాటలను ఆలకించేటప్పుడు, మీరు వింటున్నారని తెలియడానికి అప్పుడప్పుడు 'ఊ' కొట్టాలి. సంభాషణలో మీకు ఏ విషయమైనా అర్థము కానప్పుడు క్షమించండి. మరొక్కసారి చెప్పండి అని అడగాలి.
 30. ఎవరైనా మీ ఆరోగ్యం, యోగక్షేమాలగురించి ప్రశ్నించినపుడు వారికి జవాబుచెప్పి కృతజ్ఞతలు లేదా ధన్యవాదములు తెలియజేయాలి.
 31. ఎవరికైనా, అప్రియమైన లేదా బాధకల్గించే వార్తను తెలిపేటప్పుడు ముందుగా 'ఇలా చెప్పవలసివస్తున్నందుకు బాధగా ఉంది' అని చెప్పి తరువాత ఆ విషయము చెప్పాలి.
 32. భోజనముగాని, అల్పాహారముగాని చేయడానికిముందు కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
 33. మూత్రవిసర్జనము తరువాత జననాంగాన్ని నీటితో కడుక్కోవాలి. 
 34. భోజనము చేయునపుడు చెమటపడితే వస్త్రముతో తుడుచుకోవాలి.
 35. భోజనంచేసిన చోట వెంటనే నీటితో కడిగి తుడిచి శుద్ధిచేయాలి అలాగే 
 36. భోజనానికి ఉపయోగించిన కంచము, గ్లాసులను వెంటనే కడగాలి.
 37. ఇంటిపనులలో ఇతరులకు సహాయము చేస్తుండాలి.
 38. ఇంట్లో అందరూ మాతృభాషలోనే మాట్లాడుకోవాలి. ఇంకా ఎక్కువ భాషలు నేర్చుకొని మాట్లాడటానికి ప్రయత్నిస్తుండాలి.
 39. మంచి పాటలు-దైవభక్తి, దేశభక్తితోకూడిన భావయుక్తమైన పాటలు అప్పుడప్పుడు పాడుకోవాలి.
 40. క్రొత్త క్రొత్త మాటలను, వెదికి, నేర్చుకొని వ్యవహారంలో ఉపయోగిస్తుండాలి.
 41. పుట్టినరోజున చెడు మాటలతో నిందించకూడదు. 'చంపు', 'నరుకు' ఇలాంటి చెడు మాటలను ఉపయోగించకూడదు.
 42. అనవసరంగా నీటిని పారపోయవద్దు. ఎంత కావాలో అంతే నీటిని ఉపయోగించాలి.
 43. వారానికొకసారి అభ్యంగనస్నానము (శరీరానికంతా నూనె రాసుకొని) చేయాలి.
 44. 15 రోజులకొకసారి ఏమీ తినకుండా ఒకరోజు ఉపవాసము చేయాలి.
 45. అప్పుడప్పుడు కుటుంబముతో కలిసి దేవాలయానికి వెళ్ళి వస్తుండాలి. దేవాలయాల్లో జరుగు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని సహాయపడుతుండాలి.
 46. దేవాలయాల్లో తీర్థప్రసాదాలను నమ్రతతో స్వీకరించాలి. దేవాలయంనుండి బయటికి వచ్చేముందు కొంచెంసేపు కూర్చొని ధార్మిక సామాజిక విషయాలపై మనసు లగ్నంచేసి, ఆ తర్వాత తిరిగిరావాలి.
 47. వంటచేయడం, వడ్డించడం బాగా నేర్చుకోవాలి. 
 48. ఇతరులు కష్టాల్లో ఉన్నపుడు అపహాస్యపు మాటలు మాట్లాడకూడదు. చేతనైతే వారికి సహాయం చేయాలి.
 49. ఫోన్లో మాట్లాడేటప్పుడు అవసరమైనంతవరకే మాట్లాడాలి. మృదువుగా మాట్లాడాలి. ఫోన్ ఎత్తుతూనే 'హరిఃఓం', 'శ్రీరామ్', 'శివం' ఇలాంటి ఉత్తమమైన పదాలు పలకాలి. 'హలో' అని చెప్పకూడదు.
 50. పండుగల రోజుల్లో వాకిళ్ళకు మామిడి తోరణాలు కట్టే అలవాటు చేసుకోవాలి.  కనీసము రెండు వాకిళ్ళకు తోరణాలు కట్టాలి.

కుటుంబానికి కరదీపికలో తరువాతి అంశం చదవండి → "స్త్రీలు గమనించవలసిన విషయములు"

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top