సంఘ్'లో నిరంతర అభివృద్ధి మరియు నిత్యనూతనత్వం - Continuous development and everlasting innovation in 'Sangh'

0
సంఘ్'లో నిరంతర అభివృద్ధి మరియు నిత్యనూతనత్వం - Continuous development and everlasting innovation in 'Sangh'
: నిరంతర అభివృద్ధి - అదేపని అయినా నిత్యనూతనత్వం :
   సంఘం ఎప్పటికీ, ఎప్పుడో 1925లో రూపొందించుకున్న తీరులోనే జరుగుతూ ఉంటుందనుకోవటం నిజం కాదు. అప్పటి నియమనిబంధనలే ఏమాత్రం మార్పు లేకుండా అమలు చేయబడుతున్నవనుకోవటం పూర్తిగా అవాస్తవం. 1925వ సంవత్సరంలో విజయ దశమినాడు డా|| హెడ్గేవారు 15-20 మంది సన్నిహిత మిత్రులను తన ఇంటిలో సమావేశపరిచి తాము సంఘం ఏర్పరచుకొంటున్న విషయాన్ని ప్రకటించారు. 
   సంఘంలో ఏ విధమైన కార్యక్రమాలుండాలనే విషయాన్ని వారందరూ కలసి ఆలోచించారు. తొలినాళ్ళలో ఇప్పటిరూపంలో శాఖ ఉండేదికాదు. వ్యాయామం చేయటంకోసం స్వయంసేవకులు తమకు అందుబాటులో ఉన్న వ్యాయామశాల (అఖాడా) కు పోయి వ్యాయామం చేస్తుండేవారు. ఆ రోజులలో నాగపూర్ వ్యాయామశాల, మహారాష్ట్ర వ్యాయామశాల అనేవి నాగపూర్ లోని ప్రముఖ వ్యాయామశాలలు, అయితే కొన్నాళ్ళకు ఈ రెండు వ్యాయామ శాలల మధ్య పోటీ పెరిగింది. కొన్నాళ్ళ తర్వాత అణ్ణా సోహనీ స్వయంసేవకులకు ఇత్వారీ బేసిక్ స్కూల్ ఆవరణలో దండ ప్రయోగాల శిక్షణ ఇస్తుండేవారు. 
   రోజురోజుకీ పెరుగుతున్న స్వయంసేవకుల సంఖ్యకు అటువంటి స్థితిలో 1926లో మోహితేవాడలో మొదటిశాఖ ప్రారంభమైంది. శిథిలమైన ఆ పాఠశాల ఆవరణ సరిపోయేది కాదు భవనాలతో, రాళ్ళు, పిచ్చిమొక్కలు, ముళ్లు నిండివుండిన ఆ స్థలాన్ని డా||కేశవరావ్ హెడ్గేవారు, ఆయన మిత్రులూ తమ విప్లవోద్యమ కార్యకలాపాలకు వినియోగిస్తూ ఉండేవారు. క్రమక్రమంగా శాఖకు వచ్చే స్వయంసేవకుల సంఖ్య పెరిగింది. వారికొరకు వేర్వేరుచోట్ల శాఖలు నిర్వహించటం మొదలైంది. శాఖలు నాగపూర్ ని దాటి వివిధ నగరాలలోనూ, గ్రామాలలోనూ నిర్వహించబడటం ఆరంభమైంది. సంఘం విస్తరించుతున్న కొద్దీ అవసరాలకనుగుణంగా, ఆచరణీయమైన పద్ధతిలో కార్యపద్ధతిని రూపొందించు కొంటూ, వికసింపచేసుకోవడం జరుగుతున్నది. నిరంతరంగా మెరుగులు దిద్దటం జరుగుతున్నది.
డా . హెడ్గేవార్ జీ
     సంఘాన్ని స్థాపించుకున్న నాటికి, స్పష్టంగా నామకరణం లేదు. 1926 ఏప్రిల్ 7న జరిగిన సమావేశంలో సంఘానికి పేరు ఏమి ఉండాలన్న విషయమై చర్చ జరిగి 'రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్' అనే పేరు నిర్ణయింపబడింది. 1926 డిసెంబరు 19న డా|| హెడ్గేవారు సంఘానికి ప్రముఖ్'గా ఎన్నికైనారు. సంఘంయొక్క సంఘటనాత్మక  కార్యకలాపాలను సవ్యంగా నడిపించేందుకుగాను 1929లో వారిని సర్సంఘచాలక్'గా నియమించటం జరిగింది. ఆనాటి సమావేశంలో పాల్గొన్న స్వయంసేవకులు - దేశంలో ఉన్న సంఘశాఖలన్నీ సర్సంఘచాలక్ మార్గదర్శనాన్ని అనుసరించి నడవాలని నిర్ణయించారు. స్వయంసేవకుల కోరికను మన్నించి డా|| హెడ్గేవారు ఆ బాధ్యతను స్వీకరించారు. ఇంకెవరైనా సర్ సంఘచాలక్ స్థానంలో ఉండి మార్గదర్శనమందించాలనీతాను సాధారణ స్వయంసేవక్గా పనిచేస్తూ ఉండాలని డా॥ హెడ్గేవారు ఆశించారు. కాని మరొకవ్యక్తి లభించని స్థితిలో తోటి కార్యకర్తల బలమైన కోరిక మేరకు సర్సంఘచాలక్ బాధ్యతను డాక్టర్టీ స్వీకరించక తప్పిందికాదు.
    ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ప్రచారక పద్ధతి ఆరంభమైంది. అలాగే ఏటేటా వేసవికాలంలో సంఘశిక్షావర్గలు జరిగే పద్దతి మొదలైంది. ప్రారంభంలో సంఘశాఖల్లో ఒక హిందీ పద్యము, ఒక మరాఠీ పద్యములతో కూడిన ప్రార్ధన ఉండేది. సంఘం దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించిన దరిమిలా ఇప్పుడు సంఘంలో చెప్పబడుతున్న సంస్కృత ప్రార్ధన రూపొందింపబడింది. ఇది 1939లో రచింపబడింది. 1940లో దీనిని ఆమోదించి, అప్పుడు పుణెలో జరిగిన సంఘశిక్షావర్గలో ఈ నూతన ప్రార్ధనను సంస్కృతంలో ఉన్నదానిని ప్రవేశపెట్టారు. ముఖ్యులైన కార్యకర్తలు సంవత్సరానికి రెండు పర్యాయాలు కలసి కూర్చొని అన్ని విషయాలు చర్చించుకొనే పద్ధతి మొదలైంది. వీటికి కాలక్రమాన 'అఖిల భారత ప్రతినిధి సభ'యని, 'కేంద్రీయ మండల్' అని పేర్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత కేంద్రీయ మండల్ పేరును 'అఖిల భారత కార్యకారీ మండల్ అని మార్పు చేశారు.
    వీటన్నింటిబట్టి స్పష్టమయ్యేదేమిటంటే, సంఘం ముందుకుపోతున్న కొద్దీ లక్ష్యానికి అనుగుణంగా నడుస్తున్నప్పుడు లభించిన అనుభవాల కారణంగా, క్రొత్త క్రొత్త ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. యావత్ర్రపంచంలో ఇది ఒక అద్భుతమైన అనుభవం. అయిదారుగురు యువకుల బృందంగా తొలుత ఆరంభమైన ఒక సంస్థ ఈనాడు ప్రపంచంలోని అతిపెద్ద సామాజిక సాంస్కృతిక సంస్థగా గుర్తింపబడుతున్నది. సంఘం నిరంతరంగా అభివృద్ధి చెందుతున్న ఈ గాథను బట్టి సంఘం నడుస్తున్న దిశ సవ్యంగానే ఉన్నదని, లక్ష్యసాధనకై జరుగుతున్న ప్రయత్నాలు నిర్దిష్టాంగా ఉన్నవని మనం గ్రహించవచ్చు. వీటినిబట్టి మన లక్ష్యాలపట్ల మన విశ్వాసం దృఢతరమౌతున్నది. సంఘం నిరంతరంగా వికసితమవుతున్న తీరునుబట్టి - సంఘం ఏవో కొన్ని మూఢవిశ్వాసాలు కేంద్రబిందువుగా, ఒకానొక నిర్ధారిత మార్గాన్నే ఎల్లకాలలకు అనుసరిస్తూ ఉండాలనే దారిలో పోవటం లేదని అర్ధమవుతున్నది. 
   ఇలా అవసరాలకు తగిన విధంగా వికాసపథాన్ని అనుసరించే పద్దతిని మార్పుతో కూడిన నియమిత సాధనగా (Continuity with Change) పేర్కొనటం జరుగుతున్నది. లక్ష్యం దిశలలో ఏవిధమైన మార్పూ లేదు. కార్యంలో నిరంతర అభివృద్ధి ఉంది. మార్పుతో కూడిన నియమితసాధన అనేది డా||హెడ్గేవారు జీవితంలోనూ కనబడుతుంది. దానిని ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసి ఉంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top