మతమార్పిడులు చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వటం లేదు - Indian Constitution does not give the right to convert

The Hindu Portal
0
భారత రాజ్యాంగంలోని 25(1) అధికరణం పౌరులందరికీ మతస్వేచ్ఛ హక్కును కల్పిస్తోంది. ఈ హక్కు గురించి కొన్ని వివరణలు ఈ దిగువ ఇవ్వబడుతున్నాయి.

|| మతమార్పిడులు చట్టపరమైన పరిష్కారాలు ||

మతమార్పిడులు చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వటం లేదు

    భారత రాజ్యాంగంలోని 25(1) అధికరణం పౌరులందరికీ మతస్వేచ్ఛ హక్కును కల్పిస్తోంది. ఈ హక్కు గురించి కొన్ని వివరణలు ఈ దిగువ ఇవ్వబడుతున్నాయి.
  1. ఈ అధికరణంలోని మొదటి భాగం ప్రకారం పౌరులందరికీ ఆత్మసాక్షిగా మత స్వాతంత్య్రపు హక్కు (Right to Freedom of conscience) కల్పించబడింది.
  2. ఈ అధికరణంలోని రెండవ భాగం ప్రకారం పౌరులందరికీ మతాన్ని విశ్వసించడానికి, ఆచరించడానికి, ప్రచారం చేసుకోవడానికి (to Profess, Practice and Propogate) సమానమైన హక్కు ఉంది.
ఈ హక్కు అపరిమితమైనది కాదు. క్రింద చెప్పబడిన నాలుగు అంశాల ఆధారంగా ప్రభుత్వం ఈ హక్కును అదుపు చేయవచ్చు. :- 1) సామాజిక వ్యవస్థ, 2) నైతికత, 3) ఆరోగ్యం, 4) రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు.

   "మతాన్ని ప్రచారం చేసుకొనే హక్కు” అనేది ఈ అధికరణంలోని వివాదాస్పదమైన అంశం. ఈ మత ప్రచారపు హక్కులో మతమార్పిడులు చేసే హక్కు (Right to Propogate) కూడా కలిసి ఉందని క్రైస్తవ మిషనరీల అభిప్రాయం. క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతో క్రైస్తవ మతసిద్ధాంతాలను ప్రచారం చెయ్యడం ప్రతి క్రైస్తవుడి యొక్క ధార్మిక కర్తవ్యమని క్రైస్తవేతరులను క్రైస్తవులుగా మతం మార్చడం క్రైస్తవమతంలో ఆవశ్యకభాగమని, ఇలా మతం మార్చే హక్కును రాజ్యాంగ 25(1) అధికరణం తమకు ప్రసాదిస్తుందని వాదిస్తున్నారు. 
      వివాదాస్పదమైన ఈ అంశం "రెవరెండ్ స్టానిస్లాస్ బనామ్ - మధ్యప్రదేశ్ ప్రభుత్వం" కేసులో (AIR 1977 SC) 908 లో సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. 1977లో ఇవ్వబడిన తీర్పులో క్రైస్తవ మిషనరీల వాదనను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా - “తమ మతాన్ని ప్రచారం చేసుకొనే హక్కులో ఇతరులను తమ మతంలోకి మార్చేహక్కు అంతర్భాగం కాదు." అని తేల్చి చెప్పింది. ప్రచారం చేసుకొనే హక్కు అంటే అర్థం "తమ మతం యొక్క ముఖ్య సిద్ధాంతాలను వివరించడం ద్వారా తమ మతాన్ని ప్రచారం చేసుకోవడం మాత్రమే" అని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. ఈ కేసులో తీర్పును ప్రకటిస్తూ అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజిత్రే -"25(1)లో చెప్పబడిన అంతఃకరణ స్వేచ్ఛ ఒక ప్రత్యేక మతం వారికే కాక పౌరులందరికీ ఇవ్వబడిన హక్కు” అన్నారు. ఎవరికీ కూడా ఇతరులను తమ మతంలోకి మార్చే మౌలికమైన హక్కు ఏమీ లేదని దీని అర్థం. ఎందుకంటే ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని అనుసర్ించి మరొక వ్యక్తిని తన మతంలోనికి మారిస్తే అది దేశపౌరులందరికీ సమానంగా ఇవ్వబడిన అంతఃకరణ స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఒక వ్యక్తి తన మతం యొక్క సిద్దాంతాలను మరొక వ్యక్తికి ప్రసారం చెయ్యడమే కాక అతడు మతం మార్చుకోక తప్పని పరిస్థితిని కల్పించినట్లైతే అతడు ఆ వ్యక్తి యొక్క అంతఃకరణ స్వేచ్ఛను దెబ్బతీసినట్లే, అలా చేయడం రాజ్యాంగం ద్వారా నిషిద్ధం. ఒక విషయంలో ఒక వ్యక్తికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో అదే విషయంలో మరొక వ్యక్తికి కూడా అంతే స్వేచ్ఛ ఉంటుందని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. కనుక మరొక వ్యక్తిని తన మతంలోకి మార్చే
మౌలిక హక్కు లాంటిది ఎవరికీ ఉండే అపకాశం లేదు.

    మరొక్క విషయాన్ని కూడా ఈ సందర్భంలో మనం స్పష్టంగా అర్ధం చేసుకోవాలి. రాజ్యాంగంలోని 141వ అధికరణం ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశమంతటికీ వర్తిస్తుంది. పైన వివరించబడ్డ తీర్పును వెలువరిస్తూనే సుప్రీంకోర్టు మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల ద్వారా చెయ్యబడిన మతస్వేచ్ఛ చట్టాలు న్యాయబద్ధంగానూ, రాజ్యాంగానుసారంగాను ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ చట్టాలు నిర్బంధంగా, మోసం ద్వారా, ప్రకలోభాల ద్వారా ఎరచూపడం ద్వారా జరిపే మతమార్పిడులను నిషేధిస్తూ అటువంటి మత మార్పిడులు శిక్షార్ధమైనవని ప్రకటిస్తున్నాయి. ఈవిధంగా సుప్రీంకోర్టు మతమార్పిడులను అడ్డుకునే చట్టాలను సముచితంగా ఉన్నాయని ఆమోదించడమే కాక రాజ్యాంగంలో చెప్పబడ్డ మతస్వేచ్ఛ హక్కులో మతమార్పిడి హక్కు ఇమిడి లేదని స్పష్టంగా విశదీకరించింది.

....రాంప్రసాద్

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top