హిందూసమాజంలో ఎన్నో గొప్ప ప్రయోగాలు జరిగాయి - There have been many great experiments in Hindu society

0
శివాజీ 

: హిందూసమాజంలో ఎన్నో గొప్ప ప్రయోగాలు జరిగాయి :

   ఇక్కడి మన ప్రజలు జావా, బాలీ ద్వీపాలకు వెళ్లారని, మెక్సికోవంటి దూరదేశాలకూ వెళ్లారని మనం వింటూ ఉంటాం. మన సమాజంలో మొదటినుండి ఇప్పుడు కనిపించుతున్నతీరులోనే కులపరమైన కట్టుబాట్లు వాటి ద్వారా నిర్మితమైన బంధనాలు, అక్కడికి పోవద్దు, ఒక్కడికి పోవద్దు, వాళ్లనీడ నీమీద పడితే- నీవు భ్రష్టుడివైపోతావు, సముద్రయానం చేస్తే భ్రష్ఠుడివైపోతావు-ఇటువంటి ఆలోచనలు ఉండి ఉన్నట్లయితే మనవాళ్లు అటువంటి దూరతీరాలకు వెళ్లగల్గి ఉండేవారా? పెద్ద పెద్ద ప్రయోగాలను చేయగల్గిన మన సమాజంలోని సాహసికులే అక్కడికి వెళ్లి ఉంటారు.

   సముద్రతీరంవరకు వెళ్లి నిలబడి, కళ్లు మూసుకొని మంత్రం చదివి కళ్లు తెరిచేసరికి వాళ్లు జావాలోనో, బాలిలోనో ఉన్నారని, సుమత్రాలోనో ఉన్నారని చెప్పటం కుదరదుగదా! అప్పుడుకూడా వారు తగిన పరిమాణంగల నౌకలను తయారీచేసుకొని ఉంటారు. అందులో కూర్చొని గాలివాలునుబట్టి తెరచాపను మార్చికట్టుకొంటూ, నక్షత్రాలను గమనించుకొంటూ వెళ్ళవలసిన దారిలో ముందుకు పోతూ నెలల తరబడి ప్రయాణం సాగించి, వారు తమ గమ్యస్థానాలను చేరుకొనేవారు. కొన్ని సందర్భాలలో యుద్ధాలూ చేసి ఉంటారు. యుద్ధాలులేని చోట్ల ప్రేమతోను, ఆత్మీయతతోనూ అక్కడివారికి మన సంస్కృతిని అలవరచి ఉంటారు. వ్యవసాయం చేసే పద్ధతులు, ఇళ్లు నిర్మించుకొనే పద్ధతులు నేర్పించి ఉంటారు. మడికట్టుకొని వంట చేయటము, మడి బట్టలతో భోజనం చేయటం- ఇదే ధర్మం అనుకొనేవాళ్ళు, ఆధ్యాత్మిక విషయాలపై ప్రవచనాలు చేసేవాళు-వీరు మాత్రమే మన సమాజమైతే- మనం అన్ని దేశాలకు వెళ్ళి ఉండేవాళ్ళమా? మన హిందూసమాజంలో అనేక స్థాయిలు ఉన్నవి. హిందూసమాజం చరిత్రలో అనేక కాల ఖండాలున్నవి. 

మన సమాజానికి చెందిన వీరపురుషులు ఎంతగానో ధైర్యసాహసాలను ప్రదర్శించుతూ, మహత్తర ఆకాంక్షలతో విదేశాలకు వెళ్ళి, తమ శ్రేష్ఠజీవన విధానంతో అక్కడి -మానవులను ప్రభావితులను చేసి, వారికి మార్గదర్శనమందించిన వేళలు ఉన్నవి. కాబట్టి మన చరిత్రను తెలిసికొని గర్వపడటం సహజమైన విషయమే. కాగా, మధ్యలో ఉత్పన్నమైన వికృతులను సమర్థించటంపట్ల సంఘానికి ఏవిధమైన ఆసక్తి లేదు. సంఘస్వయం సేవకులు సామాన్యజీవితంలోని వివిధ సమస్యల గురించిన పరిజ్ఞానము కల్గిన వారై ఉంటారు.

ఉదాహరణకు: కులవ్యవస్థను తీసుకొందాం-ఇది మంచిగానే ఉండినది అని అభిప్రాయం చాలా మందిలో ఉంది. పూర్వకాలంలో ప్రయాణమార్గాలు తక్కువగా ఉండేవి. రాకపోకలకు ఇప్పటి మాదిరిగా వేగంగా వెళ్ళే సాధనాలు ఉండేవి కావు. పారిశ్రామిక విప్లవంవంటిది ఏదీ లేదు. కాబట్టి అప్పటి పరిస్థితులలో ఊహించదగిన, సాధ్యమైన వ్యవస్థలలో అది ఉత్తమమైనది అని భావించి అభిమానించటంలో తప్పులేదు. కాని ఇప్పటి పరిస్థితులలో కూడా, ఈ యుగంలో ఎటువంటి శక్తులు రంగంలోకి వస్తున్నవో వాటినిగురించి ఆలోచించిన తర్వాత కూడా అప్పటి ఉన్నవ్యవస్థలు యథాతథంగా ఇప్పుడూ అమలు చేయబడవలసినవేనని సంఘం మొండిగా చెప్పటం లేదు. మనం ఆలోచించే తీరు ఎలా ఉండాలి? మనుష్యుని జీవితస్థాయి, జీవన ప్రమాణం వృద్ధిచెందేటట్లుగా ఉండాలి. స్వయం సేవకులు ఈ విధమైన దృష్టికోణంతో వ్యవహరిస్తుండాలని
సంఘం కోరుతున్నది. 
  పాతకాలంలోని వ్యవస్థలు పునరుద్ధరింపబడాలని కోరుకోవటం బాగానే ఉంది. అయితే అదేసమయంలో క్రొత్తగా తలెత్తిన సమస్యలగురించి, తదితర విషయాలు గురించి అలవాటుపడిన పద్ధతికి భిన్నమైన రీతిలో కూడా ఆలోచించవలసి ఉంటుంది. భౌతిక విషయాల గురించి, జీవనప్రమాణాలగురించి ఏమీ పట్టని వైఖరిని ప్రదర్శించుతూ ఉన్నట్లయితే, ప్రజలు మనలను గురించి ఏమనుకుంటారు? 'పాతకాలపు మనుష్యులు' అనైనా అనుకుంటారు, లేదా ఇప్పుడు సంభవిస్తున్న క్రొత్త క్రొత్త మార్పులేవీ వీరికి తెలియనే తెలియవు- అనైనా అనుకుంటారు. అందుకని పురాతన వ్యవస్థలను గురించిగాని, ఆలోచనలగురించిగాని సమగ్రమైన పరిశీలన, చింతన అవసరం. పురాతనమైన విషయాలను గ్రుడ్డిగా అభిమానించటం సరైనది కాదు. రాబోయే కాలం గురించి కూడా 'రాష్ట్రపురుషుడు'  (దేశమంతా కలసి ఒక వ్యక్తి అనుకుంటే, ఆ వ్యక్తి) ఆలోచించవలసి ఉంటుంది. ఆ కారణాన ఇప్పటివరకు నడుస్తూ వచ్చిన ఆచారాలు, వ్యవస్థలు వీటి గురించిన ఆలోచనలకై పరిమితమై, వాటిని అలాగే నడవనివ్వటం, సరైనది కాదు.

ఛత్రపతి శివాజీ జీవితంలో ఇటువంటి ఒక చక్కని ఉదాహరణ ఉంది. శివాజీ వద్ద పరాక్రమవంతుడు, సాహసి అయిన ఒక సర్దార్ నేతాజీ పాల్కర్ ఉండేవాడు. శివాజీతో కొద్దిపాటి అభిప్రాయభేదాలతో, అతడు అలుకవహించి మహమ్మదీయులతో చేతులుకలిపాడు. అలాగే శివాజీకి బంధువు, సర్దారు అయిన బజాజీ కూడా మహమ్మదీయులతో చేతులు కలిపాడు. అయితే శివాజీ వారిద్దరినీ మరల తనకు అనుకూలురుగా మార్చుకొని, దగ్గరకు చేర్చుకొని వారికి శుద్ధి' (ధార్మికంగా పునరాగమనం) చేయించాడు. శుద్ధివిషయంలో ఆతర్వాత కాలంలో ఎటువంటి దృష్టి ఏర్పడిందో మనకు తెలిసినదే. ప్రాచీనసంప్రదాయాలను పట్టుకొని వేలాడేవారైన కొందరు పండితులు హిందూసమాజంలో శుద్ధికి అవకాశం లేదని ఇప్పటికీ వాదిస్తుంటారు. ఇటువంటి ఆలోచనలకారణంగా మన కాళ్ళను మనమే నరుక్కున్నట్లయింది. ఈవిధమైన భ్రాంతుల కారణంగా ఎన్నో సమస్యలు ఉత్పన్నమైనవి. కొన్నాళ్ళ క్రిందట సావర్కర్ వ్రాసిన రెండు పుస్తకాలు వెలువడినవి. వాటిలోని ఒక అధ్యాయంలో ఏమి వ్రాసినారంటే-ఇస్లాం మతానుయాయులు భారతదేశంలోని భూభాగాలను జయించినపుడు వారు అక్కడ ఉన్న దేవాలయాలను ధ్వంసం చేశారు, వాటి స్థానంలో మసీదులు నిర్మించారు. 
   మనుష్యులను ధర్మభ్రష్టులను చేశారు. వారిచేత బలవంతంగా గోమాంసం తినిపించారు. అలా హిందువులను మహమ్మదీయులుగా మతం మార్చారు. ఆ తర్వాతకాలంలో ఏమైంది? పేశ్వాలు హిందూ స్వరాజ్యానికి నాయకత్వం వహిస్తూ కాబూలువరకు జైత్రయాత్ర సాగించారు. తిరిగి వస్తూ ఉన్న సమయంలో వారు ఏమిచేయవలసి ఉండింది? బలవంతంగా ముస్లింలుగా మార్చబడిన వారిమీద గోమూత్రం చిలకరింపజేసి, వారందరినీ మరల హిందువులుగా చేసి ఉండాల్సింది. కాని వారు అలాచేయలేదు. అవి మసీదులుగానే ఉండిపోయినవి. యుద్ధంలో విజయం సాధించినప్పటికీ, మహమ్మదీయులుగా మార్చబడిన హిందువులు మహమ్మదీయులుగానే జీవితాలను కొనసాగించారు.

Post a Comment

0 Comments


Post a Comment (0)
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top