రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యక్రమాలలో నిత్యమూ శాఖలో జరిగే "ప్రార్థన" - మొదటి భాగము : Rashtriya Swayamsevak Sangha Prayer (Prardhana)

Vishwa Bhaarath
0
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ కార్యక్రమాలలో నిత్యమూ శాఖలో జరిగే "ప్రార్థన" - మొదటి భాగము : Rashtriya Swayamsevak Sangha Prayer (Prardhana)


1. ప్రార్ధన

1. నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిందుభూమే సుఖం వర్ధితో హమ్
మహామంగలే పుణ్యభూమే త్వదర్థే
పత త్వేషకాయో నమస్తే నమస్తే ||
2. ప్రభోశక్తిమన్ హిన్దురాష్ట్రాంగభూతా
ఇమే సాదరం త్వాం నమామో వయం
త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయం
శుభామాశిషం దేహి తత్పూర్తయే |
అజేయాంచ విశ్వస్య దేహీశ శక్తిం
సుశీలం జగద్యేన నమ్రం భవేత్
శ్రుతం చైవ యత్ కంటకాకీర్ణమార్గం
స్వయమ్ స్వీకృతం న స్సుగం కారయేత్॥
3. సముత్కర్ష నిఃశ్రేయసస్యైకముగ్రం
పరం సాధనం నామ వీరవ్రతం
తదన్తః స్పుర త్వక్షయా ధ్యేయనిష్ఠా
హృదన్త ప్రజాగర్తు తీవ్రా నిశమ్ |
విజేత్రీ చ న స్పంహతా కార్యశక్తిర్
విధాయాస్య ధర్మస్య సంరక్షణం
పరంవైభవం నేతు మేతత్ స్వరాష్ట్రంమ్
సమర్థా భవత్వాశిషా తే భృశమ్ || 
|| భారత్ మాతాకీ జయ్ ||

2. ప్రార్ధన

(ఉచ్చారణ కొరకు సంధి నియమానుసారం)
1. నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిన్దుభూమే సుఖవ్ వర్ధితోహమ్ |
మహామజ్గలే పుణ్యభూమే త్వదర్ధే
పత త్వేషకాయో నమస్తే నమస్తే ||
2. ప్రభోశక్తిమన్ హిన్దు రాష్ట్రాఙ్గ భూతా
ఇమే సాదరన్ త్వాన్ నమామో వయమ్
త్వదీయాయ కార్యాయ బద్ధాకటీయమ్
శుభామాశిషన్ దేహి తత్పూర్తయే |
అజయ్యాఇ్చ విశ్వస్య దేహీశ శక్తిమ్
సుశీలఇ్ జగద్యేన నమ్రమ్ భవేత్
శ్రుతఇ్ చైవ యత్ కణ్టకాకీర్ణమార్గమ్
స్వయమ్ స్వీకృతన్ న స్సుగబ్ కారయేత్ ||
3. సముత్కర్ష నిశ్శ్రేయ సస్యైక ముగ్రమ్
పరమ్ సాధనమ్ నామ వీరవ్రతమ్
తదన్తః స్ఫుర త్వక్షయా ధ్యేయనిష్ణా
హృదన్త ప్రజాగర్తు తీవ్రానిశమ్
విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్
విధాయాస్య ధర్మస్య సంరక్షణమ్
పరవ్ఁ వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రమ్
సమ మార్థా భవత్వాశిషా తే భృశమ్ ||
|| భారత్ మాతాకీ జయ్ || 

3. ప్రార్థనయొక్క ఉచ్చారణ

ప్రార్థనవల్ల భావైక్యత పూర్తిగా సిద్ధించాలంటే అందులోని శబ్దాలను అందరూ సరిగా ఒకే విధంగా ఒకే లయతో ఉచ్చరించటం ఎంతో అవసరం. ఈ దృష్టితో కొన్ని సూచనలు ఈక్రింద ఇవ్వబడ్డాయి. వీనిద్వారా ప్రార్థనను సరిగా ఉచ్చరించటానికి అవసరమైన మార్గదర్శనం లభిస్తుంది. అనుమానాలేమైనా ఉంటే తొలగిపోతాయి. 
  ప్రార్ధన చెప్పేటప్పుడు రకరకాలైన తప్పులు దొర్లుతుంటాయి. తప్పులు రావటానికి కొన్ని కారణాలు ఇవి :
  1. వైయక్తికమైన ఉచ్చారణ దోషాలు.
  2. ప్రాంతీయ భాషలలోని ఉచ్చారణ పద్ధతులలోని వైవిధ్యం.
  3. ప్రార్ధనలోని శబ్దాల శుద్దస్వరూపం తెలియకపోవటం.
  4. ప్రార్ధనకు అర్ధం తెలియకపోవటం.
  5. హ్రస్వం, దీర్ఘం, మీది సవర్ణం- ఇవి తెలియకపోవటం లేక అజాగ్రత్త.
  6. యతిభంగం.
  7. ప్రార్ధన చెప్పటంలో వేగం లేదా నిదానం. 
  8. అనవసరమైన ఆలాపాలు, రాగాలు.
   ప్రార్థనలో “ఋ” కార ప్రయోగం
మొదటి శ్లోకంలో “మాతృభూమే”, రెండవ శ్లోకంలో “స్వీకృతం, మూడవ శ్లోకంలో హృదంతః” “భృశం” ఇవే ప్రార్ధనలో వచ్చిన “ఋ"కార ప్రయోగాలు.
  “మాతృభూమే" అన్న శబ్దంలో "తృ" యొక్క ఉచ్చారణ "శత్రు" శబ్దంలోని “త్రు”లాగా కాదు, అలాగే “త్రిభువన్'లోని "త్రి” లాగా కాదు. అది “త” కార “ర“ కారాలతో కూడిన "ఉ” కారమో “ఇ” కారమో కాదు. “త” కారంతో “ఋ“” అనే స్వరంయొక్క కూడిక మాత్రమే. “ఋ అనేది "అ", "ఇ", “ఉ"ల లాగానే ఒక స్వతంత్రాక్షరం. ఇది గుర్తుంచుకోవాలి. సాధారణంగా దీనిని "త్రు”కు "త్రి"కి మధ్య ఉచ్చరించవచ్చు.
   “స్వీకృతం", "హృదంతః', "భృశం"- ఈ శబ్దాలలో "కృ" "హృ", "భృ" ఉచ్చారణ కూడా ఈ సూచన ప్రకారమే చేయాలి.

  శి', "ష్', “స్” ల ప్రయోగం
ప్రార్ధనలో “శ్', “ష్', “స్” ఈ మూడు వర్ణాలూ చాలాసార్లు వచ్చాయి. వాని ఉచ్చారణ ఒకే విధంగా ఉండదు. తేడా ఉంటుంది. 
   "శి"ను ఉచ్చరించేటప్పుడు నాలుక 'తాలు” ప్రదేశాన్ని తాకుతుంది. “చ” వర్గలోని వర్ణాలను ఉచ్చరించేటప్పుడు నాలుక ఎక్కడ తాకుతుందో ఆ స్థానాన్ని తాలువు అంటారు. అందువల్ల “శ్"ను తాలవ్యము అంటారు. “శంకరుడు', 'శాసనము" "శత్రువు” మొదలైన శబ్దాలలో తాలవ్యమైన ఈ "శ" ప్రయోగం కనిపిస్తుంది.
   “ష్"ను పలికేటప్పుడు నాలుగు మూర్ధస్థానాన్ని తాకుతుంది. “ట” వర్గలోని అక్షరాలను పలికేటప్పుడు నాలుక ఎక్కడ తాకుతుందో ఆ స్థానాన్ని మూర్ధస్థాన మంటారు అందువల్ల “ష్"ను మూర్ధన్యమంటారు. “షడాననుడు”, "హర్షము", "భూషణము మొదలైన శబ్దాలలో మూర్ధన్యమైన ఈ “ష్' ప్రయోగం కనిపిస్తుంది.
   “స్” ను ఉచ్చరించేటప్పుడు నాలుక దంతమూలాన్ని స్పృశిస్తుంది. "త” వర్గలోని అక్షరాలను ఉచ్చరించేటప్పుడు నాలుక ఏ స్థానాన్ని తాకుతుందో దానిని దంతమూలం అంటారు. అందువల్ల “స్"ను దంత్యము అంటారు.  "సరళ", "సర్కారు" సనాతనము” మొదలగు శబ్దాలలో దంత్యమైన ఈ “స్” ప్రయోగం కనిపిస్తుంది.

ప్రార్థనలో “శ్" “ష్" “స్"ల ప్రయోగాలు ఈ క్రిందిచోట్ల వస్తాయి:
1. తాలవ్యమైన శకారం
 » రెండవ శ్లోకంలో - 'శ'క్తిమన్, 'శు'భాం, ఆ 'శి'షం, వి'శ్వ'స్య, దేహీశ', 'శ'క్తి , సు'శీ'లం, 'శ్రు'తం.
 » మూడవ శ్లోకంలో- ని శ్రే'యసస్య, అని'శం, ఆ'శి'షా, భృ'శ'ం.
2. మూర్ధన్యమైన ష కారం
 » మొదటిశ్లోకంలో - ఏ'షః'
 » రెండవశ్లోకంలో - రా'ష్ట్రాం'గ, ఆశి'షం
 » మూడవశ్లోకంలో - సముత్కర్ష', అ'క్ష'యా, సంర'క్ష'ణం, స్వరా'ష్ట్రం', ఆశి'షా'.
3. దంత్యమైన సకారం
  •  మొదటి శ్లోకంలో - నమ'స్తే', 'స'దా, వ'త్స'లే, 'సు'ఖం, నమస్తే', నమ'స్తే'
  •  రెండవ శ్లోకంలో - 'సా'దరం, విశ్వస్య', 'సు'శీలం, 'స్వయం, 'స్వీకృతం, 'సు'గం
  •  మూడవ శ్లోకంలో - 'స'ముత్కర్ష, నిశ్రేయ'స"స్య, 'సా'ధనం, 'స్ఫు'రతు, 'స'ంహతా
  •  విధాయా'స్య', ధర్మ'స్య', 'సం'రక్షణం, 'స్వ'రాష్ట్రం, 'స'మర్థా.
హ్రస్వాన్ని గురువుగా పలకటం
ప్రార్ధనలో హ్రస్వాన్ని హ్రస్వంగా, దీర్జాన్ని దీర్ధంగానే పలకాలి. హ్రస్వానికి ముందు సంయుక్తాక్షరం వస్తే, అప్పుడు ఆ హ్రస్వం గురువు అవుతుంది (దీర్హంకాదు). అందువల్ల ఉచ్చరించేటప్పుడు దానిని ఒత్తిపలకాలి. అలా చేయకపోతే, హ్రస్వాన్ని దీర్హంగా పలికే పొరబాటు జరిగే అవకాశం వుంది. అది సరియైన ఉచ్చారణ కాదు. 
ఉదాహరణకు: - 
  • “వర్ధితః” అనే శబ్దాన్ని తీసుకుందాము. దీనిని “వర్‌ ధితః” అని పలకాలి. కాని
  • “వ౭_ర్ధితః” అని కాదు.
ప్రార్ధనలో హ్రస్వాలను గురువులుగా పలకవలసినచోట్లు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. 
  • మొదటిశ్లోకం - నమ'స్తే, 'విత్సలే, 'హిన్దుభూమే, 'వర్ధితోల.హమ్‌, 'పుణ్యభూమే, త్వదక్ధే, ప'తత్వేషు నమ'స్తే నమస్తే.
  • రెండవశ్లోకం - 'శక్తిమన్‌, 'హిన్టురాష్ర్రాంగ భూతాః “బిద్దా, 'త'త్పూర్తయే, ఆ'జుయ్యాం, “విశ్వస్య, “శక్తిం, జ'గద్యేన, “నిమ్రం, 'నిస్సుగం, “యిత్మంటకాకీర్ణ.
  • మూడవళ్లోకం - స'ము"త్కుర్న 'నిశేయ, 'సొస్యైకము'గ్రం, వీరవ్రతం, త'దన్తస్‌, స్ఫురత్వక్షయా, ధ్యేయానిష్టా హృదిన్త, ్రజా'గూర్తు, 'నిస్సంహతా, కార్యశకిర్‌, విధాయాస్య “ధర్మస్య, సం'రక్షణం, నేతుమేతి'త్‌ స్వరాష్ట్రం, సమర్ధా, భ'విత్వాళిషా. వీటిని దీర్చాలుగా పలకరాదు.
అనుస్వారం వచ్చినప్పుడు
   ప్రార్ధన చెప్పేటప్పుడు సంధి నియమాలను తు.చ. తప్పకుండా పాటించాలి. వానిలో కొన్ని నియమాలు వ్యాకరణశాస్త్రరీత్యా వైకల్పికాలు, అంటే ఐచ్చికమైనవి. అయినా సంస్కృతశ్లోకాలు చదివే పరిపాటి ఒకటి ఉంటూ వచ్చింది కనుక దానిదృష్ట్రా ఆ నియమాలను పాటిస్తూనే ప్రార్ధన చెప్పాలి. ఉచ్చారణ అన్నిచోట్ల సమానంగా ఉండటం కొరకు ఇది అవసరం. పాణిని పరిభాషలో “అనుస్వారస్య యయి పర సవర్ణఃొ అనేది మీది సవర్ణంయొక్క నియమం. అంటే అనుస్వారానికి తరువాత శు షు స, హిలను వదిలి మిగిలిన హల్లులు ఏవీ వచ్చినా, అప్పుడు అనుస్వారానికి బదులు ఆ వర్దానికి సవర్ణమైన అనునాసికం వస్తుంది. 
ఉదాహరణకు: -
(అ) సుగంకారయేత్‌ - ఇక్కడ అనుస్వారానికి తరువాత “క” వచ్చింది. కనుక “క” వర్గులో అనునాసికమైన “జ” అనుస్వారానికి మారుగా వచ్చి “సుగజ్‌ కారయేత్‌” అను ఉచ్చారణ వస్తుంది.
(ఆ) అజయ్యాంచ - ఇందులో అనుస్వారం తర్వాత “చ” వచ్చింది కనుక అనుస్వారానికి బదులు “చ” వర్గు యొక్క అనునాసికమైన “ఇ” వస్తుంది. ఇప్పుడు “ఆజయ్యాఇ్‌” అని ఉచ్చారణ వస్తుంది.
(ఇ) సాదరం త్వాం - ఇందులో అనుస్వారం తరువాత “త్‌” వచ్చింది. కనుక అనుస్వారానికి బదులు “త” వర్షులోని అనునాసికమైన “న్‌” వస్తుంది. ఉచ్చారణలో ఇది “సాదరన్‌త్వాం” అయింది. ఇదేవిధంగా “త్వాంనమామో” ఉచ్చారణలో “త్వాన్‌ నమామో” అవుతుంది. ఇలాగే తక్కినవి.
(ఈ) సుఖం వర్ధితో౭_హమ్‌ - ఇందులో అనుస్వారం తరువాత “వ” వచ్చింది. “వ్‌”లో రెండు రకాలున్నాయి. ఒకటి మామూలు “వ్‌ రెండవది అనునాసికంతో కూడిన న “వ్‌ం”. ఇక్కడ అనుస్వారానికి మారుగా అనునాసికయుక్త “వ్‌” (వ్‌౦ రాగా “సుఖవ్‌ంవర్ధితో౭_ హమ్‌ అనే ఉచ్చారణ వస్తుంది. ప్రార్ధనలో అనుస్వారానికి బదులు అనునాసికయుక్త సవర్జాల వాడుక ఈ క్రిందిచోట్ల ఉంటుంది.

మొదటి శ్లోకం : సుఖం వర్ధితోలిహమ్‌ = సుఖవ్‌ం వర్ధితో౭_హమ్‌
రెండవ శ్లోకం : సాదరం త్వాం నమామో = సాదరన్‌ త్వాన్‌ నమామో
శుభామాశళిషం దేహి = శుభామాశిషన్‌ దేహి
అజయ్యాంచ = అజయాళ్బు
సుశీలం జగద్యేన = సుశీల్‌ జగద్యేన
నమం భవేత్‌ = నమమ్‌ భవేత్‌
(శుతం చైవ = శ్రుతజ్‌ చైవ
సుగంకారయేత్‌ = సుగజ్‌ కారయేత్‌

మూడవశ్లోకం : ఉగ్రం పరమ్‌ = ఉగ్రమ్‌ పరమ్‌
సాధనం నామ = సాధనన్‌ నామ
పరం వైభవం నేతుమ్‌ = పరవ్‌ం వైభవమ్‌ నేతుమ్‌

ప్రార్ధనలో విసర్గల ఉచ్చారణ
  విసర్ద తర్వాత “శ” వస్తే విసర్లకు బదులు “శ్‌” అని పలకాలి. “స” వస్తే విసర్గుకు బదులు “స్‌” అని పలకాలి. ప్రార్ధనలో -
  • నః సుగం = నస్‌ సుగం
  • నిః శ్రేయసస్యైకముగ్రం = నిశ్‌శ్రేయ సస్యైకముగ్రం
  • తదన్తః స్ఫురతు = తదన్తస్‌ స్ఫురతు
  • నఃసంహతా = నస్‌ సంహతా అని పలకాలి.
ఈ నియమాన్నే పాణిని సూత్రాల్లో ఈ క్రింది విధంగా చెప్పవచ్చు. 
(1) “విసర్జనీయస్య సః :- విసర్ణ తరువాత స్వరములు వస్తే (చఛట,ఠ,త, థ,శృషస) విసర్గకు బదులు 'సికారం ఆదేశమవుతుంది.
(2) “స్తోశ్చు నాశ్చుః - “సొ కారానికీ “త" వర్గానికీ తర్వాత “శ” కారమో లేక “చ” వర్షులోని వర్దాలో వచ్చినప్పుడు “స” కారమున్నచోట “శ” కారమూ, “త” వర్గమున్న చోట “చ” వర్గము వస్తాయి. ఈ సూత్రాల ప్రకారం ప్రార్థనలోని విసర్గలను పైన చెప్పిన విధంగా పలకాలి.
హృదన్తః ప్రజాగర్హు - హృదన్తగ ప్రజాగర్హు.
ఇక్కడ విసర్గ తర్వాత “ప” వచ్చింది. ఇటువంటిచోట విసర్దను పూర్తిగా పలకటం జరగదు. తరువాత వచ్చే “ప" యొక్క సహాయంతో విసర్దను సగం పలకాలి. ఈ ఉచ్చారణకు “ఉపధ్మానీయము” అనే శాస్త్రీయ సంకేతం ఉంది. ఉపధ్మానీయంలో విసర్గకు పూర్తి ఉచ్చారణ ఉండదు. అలాగే ఇక్కడ “పొకు ద్విత్వంకూడా లేదు. హృదన్త ప్రజాగర్హు. ఈ విధంగా ఉపధ్మానీయ ఉచ్చారణను వ్రాస్తారు, పాణిని నియమం ప్రకారం.
(3) "*కుప్‌వోః కః పోచి - విసర్ష్ద తరువాత “క, 'ఖ'లు వస్తే విసర్దకు “జిహ్వామూలీయము”, “ప", ఫాలు వస్తే, “ఉపాధ్మానీయము” అయిన ఉచ్చారణ వస్తుంది. మన ప్రార్థనలలో జిహ్వామూలీయ ఉచ్చారణ లేదు.

ఇంతవరకు చెప్పినచోట్లకాక ఇంకా రెండుచోట్ల తప్పు పలకటానికి అవకాశం ఉంది.

“జగద్యేన” - ఇక్కడ “ద్" (హలంతం), “య”లను స్పష్టంగా విడివిడిగా ఉచ్చరించాలి, “ద్‌”కు ద్విత్వమిచ్చి “జగద్దేనా అని గాని, జగద్ధ్హెన అని మహా ప్రాణంగా గాని పలకటం తప్పు.
“ధ్యేయనిష్థా- ఇందులో “ధ్‌"కు ద్విత్వమిచ్చి “ద్దేయనిష్థా” అనటం కాని, లేక “య"ను పలకటం మానివేసి “ధేయనిష్థా” అనటం కాని సరికాదు.

ప్రార్ధన ఏ వృత్తంలో ఉంది
  మన ప్రార్ధనలో మూడు శ్లోకాలున్నాయి. మొదటిశ్లోకం “భుజంగ ప్రయాతం” అనే వృత్తంలో వుంది. మిగిలిన రెండు శ్లోకాల వృత్తం క్రొత్తగా నిర్మింపబడింది. ఈ వృత్తానికి “మెఘనిర్జోషం” అనే పేరు పెట్టబడింది. ఈ పేరుగల వృత్తం సంస్కృతంలోని ప్రాచీన ఛందశ్శాస్త (గ్రంథాలలో లేదు. ఈ వృత్తాన్ని భుజంగ ప్రయాత వృత్తంయొక్క విస్తరణగా మనం భావించవచ్చు.

భారత్‌ మాతాకీ జయ్‌

ఈ  జయకారాన్ని రకరకాలుగా విరిచి. ఉచ్చరించటం జరుగుతున్నది.

ఉదాహరణకు-
1. భారత్‌ మాతా....కీ జయ్‌
భారత్‌ మాతా....కీ.... జయ్‌
3. భారత్‌ మాతాకీ.... జయ్‌
4. భారత్‌మాతాకీ జయ్‌
వీటిల్లో చివరి (4వ పద్ధతి సరియైనది.
   ఈ జయకారం హిందీలో ఉండటంచేత హిందీభాషలోని ఉచ్చారణ ప్రకారం “భారతన “భారత్‌ొగా “జయ”ను “జయ్ పలకాలి. “జయ్‌” అనే శబ్దాన్ని “జై” అని పలకకూదదు.

తరువాతి వ్యాసము :» 5. ప్రార్థనకు అన్వయం 

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top