దాక్టర్‌జీ స్మృతిమందిర నిర్మాణ ప్రారంభోత్సవం 1962 ఏప్రిల్‌ 5వ తేదీ - Inauguration of Dr. Hedgewar Memorial Building April 5, 1962

Vishwa Bhaarath
0
దాక్టర్‌జీ స్మృతిమందిర నిర్మాణ ప్రారంభోత్సవం 1962 ఏప్రిల్‌ 5వ తేదీ - Inauguration of Dr. Hedgewar Memorial Building April 5, 1962
దాక్టర్‌జీ స్మృతిమందిరం - Dr. Hedgewar smriti mandir 

స్మృతిమందిర నిర్మాణ ప్రారంభోత్సవం
స్మృతిమందిర నిర్మాణం పూర్తయిందనే వార్త ఆనోట ఆనోటా దేశమంతటా ప్రాకిపోయింది. మందిరానికి ప్రారంభోత్సవం ఎప్పుడు జరుగుతుందనే కుతూహలం సర్వత్రా వ్యక్తమయింది. ఈ ఉత్సవానికై నాగపూర్‌ వచ్చి సంఘ గంగోత్రిని దర్శనం చేసుకోవాలనే అభిలాష స్వయంసేవకు లందరిలో సహజంగా జనించింది. చరిత్రా త్మకమైన ఆ ప్రారంభోత్సవం తేదీ కోసం ప్రతి ఒక్కరూ ఆతురతతో ఎదురు చూస్తున్నారు.
   శక సంవత్సరం 1884 ఉగాదినాడు (1962 ఏప్రిల్‌ 5వ తేదీన) మందిరానికి ప్రారంభోత్సవం జరగాలని నిర్ణయించారు. దేశంలో విజయధ్వజాన్ని ఎగరవేసిన శాలివాహన సషమ్రాట్టునుస్మరింపజేసే చైత్రశుద్ధ పాద్యమి దాక్టర్‌జీ జన్మదినంకూడా.  ఉగాదినాడు ఈ ప్రారంభోత్సవాన్ని ఏర్పాటుచేయడం ఎంతో సముచితం. విద్యార్థులకు పరీక్షలసమయం అయినా, ఉగాది మహత్తును దృష్టియందుంచుకొని అదేరోజున స్మృతిమందిరం ప్రారంభోత్సవానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పదివేలమంది స్వయంసేవకులు పాల్గొంటారనే ఆలోచనతో ఏర్పాట్లకు పథకం వేయబడింది. ఇంతటి భారీసంఖ్యలో వచ్చే స్వయంసేవకులకు భోజనం, వసతి ఏర్పాట్ల బాధ్యతను స్థానిక స్వయంసేవకులు స్వీకరించారు. అతిధిమర్యాదలకు పేరెన్నికగన్న నాగపూరు పౌరులు ఉత్సాహంతో వారికి అండగానిలచారు. స్వయంసేవకులందరికీ ఏర్పాట్లు ఇళ్ళలో జరగాలని నిర్ణయించారు.

నాగపూరు డాక్టర్‌జీకి కర్మభూమి. నాగపూరు పౌరులు డాక్టర్‌జీని వివిధ రూపములలో, వివిధ దశలలో చూచిఉన్నారు. ఇది జరిగి నేటికి 22 ఏండ్లు గడిచింది. ఇప్పుడు స్మృతి మందిరం రూపంలో డాక్టర్‌జీ స్మృతికి ఆకారం ఏర్పడుతుందనీ, భారతవర్ష్నంలోని కోన కోన నుండి అతిథులుగా వచ్చే స్వయంసేవకులకు స్వాగతం ఇచ్చే అదృష్టం లభిస్తుందనీ వారికి మహదానందం కలిగింది. ఉత్సవానికి ఒకటి రెండు రోజులు ముందు నుండే ప్రతి రైలులోను వేలాది స్వయంసేవకులు నాగపూరు స్టేషనులో దిగసాగారు. వెంట వెంటనే వారిని నిర్ణీత స్థలాలకు కొనిపోవడానికి ఏర్పాటు జరిగింది. ఎట్టి లోటుపాటులు లేకుండా వసతికి, భోజనానికి చక్కని ఏర్పాట్లు జరిగాయి.
    వివిధ భాషలు, పలువిధములైన వేషభూషలు, ఆహారవిహారాలు, రీతి రివాజులు కలిగిన వేలాది స్వయంసేవకులు చిన్న చిన్న జట్లుగా ఏప్రిల్‌ 4వ తేదీనుండే నాగపూరు నగరమంతటా విహరించసాగారు. పరమపూజనీయ డాక్టర్‌జీ సాన్నిహిత్యంతో పావనమయిన ప్రతివస్తువునూ చూడడం, డాక్టర్‌జీ పరిచయ భాగ్యాన్ని పొందగలిగిన పాత స్వయంసేవకులను కలుసుకోవడం వారి స్మృతులను వినడం. నాగపూరులోని సంఘ శాఖలను, కేంద్ర కార్యాలయాన్ని సంఘ అధికారుల గృహాలను దర్శించడం ఇత్యాది కార్యక్రమాలలో సామాన్య స్వయం సేవకులు నిమగ్నులయ్యారు. స్వయంసేవకుల ఈ కార్యక్రమాలవల్ల నగరంలో విలక్షణమైన ఒక చైతన్యం వెల్లివిరిసింది. ఒక ప్రక్క కేంద్రకార్యాలయంలో ప్రతినిధిసభ సమావేశం జరుగుతోంది. మరో ప్రక్క కేంద్ర సంఘస్థానంలో ప్రారంభోత్సవానికి భారీయెత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.
శ్రీ గురూజీ
శ్రీ గురూజీ
   దశదిశలా ఆనందాన్ని చిందిస్తూ ఉగాది పర్వదినం వచ్చింది. డాక్టర్‌జీ యొక్క 72వ జన్మదినమది. కేంద్ర కార్యాలయంపై భగవాధ్వజం రెపరెపలాడుతోంది. మంగళ తూర్యరవాలతో రేశమ్‌బాగ్‌ మైదానం ప్రతిధ్వనిస్తోంది. నాటి ప్రాతః సమయాన పరమపూజనీయ శ్రీ గురూజీ శాస్రోక్తమైన పద్ధతిలో సమాధిపై ఓంకారయుక్తమైన శిలను ప్రస్థాపించారు. వేదశాస్త్ర పారంగతులైన శ్రీ భయ్యాజీ ఆర్వీకర్‌ పురోహిత కార్యాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని వేదశాఖలకూ చెందిన బ్రాహ్మణులు వేదపఠనం చేస్తున్నారు. అఖిల భారతీయ ప్రతినిధిసభ సభ్యులతో పాటు అనేకమంది స్వయం సేవకులు, పారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్‌జీ కుటుంబసభ్యులు అనేకులు సజల నయనాలతో ఈ కార్యక్రమాన్నిదర్శిస్తున్నారు. ఈ ముహూర్తంలో వారి హృదయాలలో ఏ భావనా తరంగాలు ఉవ్వెత్తున సుళ్ళు తిరిగాయో వర్ణించడం అసంభవం.
   శిలా ప్రన్థాపన అనంతరం శ్రీ గురూజీ డాక్టర్‌జీ విగ్రహాన్ని పూలమాలతో అలంక రించారు. వేదవిదులైన బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చారు. ప్రముఖ కార్యకర్తలను సభకు పరిచయం చేశారు. మందిరం నిర్మాణంలో ప్రధానపాత్ర వహించిన కొందరు. ప్రముఖులకు బహుమతులు ఇచ్చి, చందన తాంబూలాలతో సత్కరించారు. తర్వాత ప్రసాదం పంచిపెట్టారు. ఈ కార్యక్రమం సుమారొక గంటసేపు జరిగింది. ఈ తరుణంలో స్మృతిమందిరంలో ఉన్న ఒక వృద్భురాలిని గురించి పేర్కొనడం అవసరం. ఆమె శ్రీమతి తాయీజీ- శ్రీ గురూజీయొక్క మాతృదేవి. చాలాకాలంగా మంచాన ఉన్నప్పటికీ ఆవిడ పట్టుదలపట్టి స్మృతిమందిరం వద్దకు వచ్చింది. ఆనందంతో పరవశించిపోయింది. డాక్టర్‌జీ సమాధిని, విగ్రహాన్ని చూచినప్పుడు ఆమె హృదయంలో కదలాడిన భావపరంపరను మాటలతో వర్ణించడం సాధ్యమా 9 డాక్టర్‌జీతోను, గురూజీతోను, తాయీజీతోను సన్నిహిత పరిచయం కలిగినవారే అప్పటి ఆమె మనస్థితిని ఊహించగలరు.

   ఆనాటి సాయంత్రం ప్రారంభోత్సవం. ఈ మధ్యకాలం పరస్పర పరిచయాలతో, స్నేహ సంభాషణలతో, స్మృతిమందిర సందర్శనాలతో క్షణంలో గడచిపోయింది. మరోప్రక్క పరిసరప్రదేశాలనుండి భారీసంఖ్యలో స్వయంసేవకులు వివిధప్రయాణ సాధనాలలో నాగపూరు చేరుకొనడం సాగుతూనే ఉంది. కాలినడకన వచ్చారు కొందరు. 
   మధ్యాహ్నం మూడుగంటల నుండి నాగపూరులోన త్రోవలన్నీ కేంద్ర సంఘస్థానంవైపే పోతున్నాయి. స్వయంసేవకుల పౌరుల బారులు రేశమ్‌బాగ్‌వైపు అనంతరంగా సాగిపోతున్నాయి. వారి ఆనందానికి నేడు అవధులు లేవు. అయినా క్రమశిక్షణ, కట్టు బాటు ఒకరు చెప్పకుండానే ఏర్పడ్డాయి. చాలామందికి నాగపూరు రావడం ఇదే ప్రథమం. వారిలో డాక్టర్‌జీని స్వయంగా చూచినవారు వ్రేళ్ళపై లెక్కింపదగినవారే, ఆ కారణాన స్మృతిమందిర దర్శనం వల్ల నేడు వారికి దాక్టర్జీయొక్క సాన్నిధ్యంయొక్క అనుభూతి కలగడం అసహజంకాదు. దాక్టర్జీయొక్క మిత్రులు తమ స్మృతులను వినిపిస్తూ స్మృతిమందిరం నలుగడలూ దాక్టర్‌జీయొక్క సుగుణ కుసుమాల పరిమళాన్ని నిరంతరాయంగా వెదజల్లుతూ ఉన్నారు. 1940లో దాక్టర్‌జీ సంఘ శిక్షావర్గలో తమ అంతిమ ప్రసంగంలో *నేను నా కళ్ళయెదుట  హిందూరాష్టంయొక్క సంక్షిప్త స్వరూపాన్ని చూస్తున్నాను” అని అన్నారు. 22ఏండ్ల తర్వాత నేడు వారి ఆ కల్పనను చరితార్థం చేస్తూ వేలాది సయంసేవకులు ప్రారంభోత్సవానికై స్పృతి మందిరం ఎదుట ఉపస్థితులై ఉన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రత్యక్షంగా పాల్గొనజాలని లక్షలాది స్వయంసేవకులు తమతమ స్థలాలలోనే
దాక్టర్‌జీకి తమ భావ ప్రసూనాంజలి అర్చించారు.

   ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు ముందుగానే పూర్తయినాయి. యాబైవేలమంది ప్రజలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. గణవేషధారులయిన ప్రబంధకులు వారికి త్రోవచూపడానికి నిలచి ఉన్నారు. స్మృతి మందిరం ఎదుట ధ్వజస్తంభం దానికి ఎదురుగా భవ్యమైన వేదిక నిర్మించబడ్డాయి. మహిళలు కూర్చొనడానికి ప్రత్యేకంగా స్ధలం కేటాయించబడింది. మందిరానికి ఒక ప్రక్క వివిధ వాయిద్యములతో సుసజ్జితమైన ఘోష్‌ విభాగం వైభవంతో నిలచి ఉంది. రాగ రాగిణులపై ఆధారితమై నూతనమైన సైనికవాద్యం అందరి దృష్టినీ ఆకర్షించుకుంటోంది. నలువైపులా అమర్చబడిన విద్యుద్దీపాల వెలుగులో స్మృతిమందిరం శోభాయమానంగా ఉంది. నిర్ణీత సమయానికి పూర్వమే ఆహ్వానితులైన స్త్రీ పురుషులు, స్వయంసేవకులు తమతమ స్థానాలలో ఆసీనులై ఉన్నారు.
   సరిగా ఆరున్నర గంటలకు పరమపూజనీయ శ్రీ గురూజీ సంఘస్టాన్‌లో ఉపస్థితులయ్యారు. ఘోష్‌ వాయిద్య నినాదాల మధ్య వారికి సర్‌సంఘచాలక్‌ ప్రణామ్‌ ఇవ్వబడింది. అనంతరం వారు సమాధిపైనా, విగ్రహానికీ పూలమాలలు సమర్పించి గంధాక్షితలను నలుగడలా చల్లి పరమపూజనీయ డాక్టర్‌ హెడగేవార్‌జీయొక్క స్మృతిమందిరానికి ఆవిష్కరణ చేశారు. ఆవిష్కరణకు
అనుసరించబడిన ఈ పద్ధతి నూతనము, అర్ధవంతము అయినది. తెర తొలగించి, లేక రిబ్బను కత్తిరించి ఆవిష్కరణ చేసే పద్ధతి సర్వత్రా అనుసరించబడుతోంది. కాని ఇక్కడ కామకోటి పీఠాధిపతి అయిన శ్రీమద్‌ శంకరాచార్యులవారు, ప్రత్యేకంగా పంపిన మంగళాక్షతలు చల్లడంద్వారా ఆద్య సర్‌ సంఘచాలక్‌ యొక్క  స్మృతిమందిరానికి ఆవిష్కరణ జరిగింది. ఇది మణికాంచన సంయోగమే. 
   ఆవిష్కరణ అనంతరం ఆద్య సర్‌సంఘచాలక్‌ ప్రణామ్‌ ఇవ్వబడింది రాజాసాహబ్‌  శ్రీ ఫత్తే సింహరావ్‌ భోంస్తే విగ్రహానికి పుష్పహారం సమర్పించి కొత్తగా సరకార్యవాహగా ఎన్నికైన శ్రీ భయ్యాజీదాణీకి, నాగపూరు సంఘచాలక్‌ శ్రీ బాబాసాహెబ్‌ ఘటాటేకు నుదుట కుంకుమ పెట్టారు. ఆ తర్వాత వీరందరితో శ్రీ గురూజీ వేదికపైకి వచ్చారు.

సూర్యభగవానుడు న్మృతిమందిరానికి అభివాదనంచేని అస్తాద్రిని చేరుకుంటున్నాడు. భాస్మరుని బంగారు కిరణాలు స్మృతి మందిరంపై అలౌకికమైన కాంతిపుంజాన్ని వెదజల్లుతున్నాయి. ఈ వాతావరణంలో ఘోష్‌ వాయిద్యంపై ధ్వజారోహణ మంత్రం ఇలా ప్రతిధ్వనించసాగింది.
ఓం నమోస్తు తే ధ్వజాయ
సకల భవన జన హితాయ
విభవసహిత విమలచరిత
బోధకాయ, మంగలాయ తే సతతమ్‌ ॥
   మృదు మధురమై భాగేశ్వరి స్వరంతో మంత్రముగ్ధమైన వాతావరణంలో స్వర్ణగైరిక భగవాధ్వజం ఎత్తుగా ఆకసంలో రెపరెపలాడుతోంది. ధ్వజ ప్రణామం జరిగింది. 50-60 వేల కంఠములనుండి ప్రార్ధన వెలువడింది. అనంతరం వేదబుక్కుల గానంతో కార్యక్రమం ప్రారంభమయింది. ప్రసిద్ధ సంగీత దర్శకులు శ్రీ సుధీర్‌ఫడ్మే “లో శ్రద్ధాంజలి” గీతాన్ని గానం చేశారు. విశిష్టము, ఆకర్షకము
నయిన శైలివల్ల పాటలోని ప్రతి పంక్తిలోనూ, డాక్టర్‌జీ జీవితంలోని ఒక్కొక్క ఘట్టం సజీవంగా సాక్షాత్మరించినట్లనిపించింది. ఈ పాట తర్వాత శ్రీ గురూజీ ఉపన్యాసానికై లేచి నిలచారు. “వాస్తవానికి కామకోటి పీఠాధిపతి శ్రీమద్‌ శంకరాచార్యులవారి ద్వారానే స్మృతిమందిర ఆవిష్మరణ జరగవలసింది. కాని కొన్ని అనివార్యకారణాలవల్ల వారు తమ స్థలం వదలి రాలేకపోయారు. కనుక
వారు మంగళాక్షతలు, ఆశీర్వచన సందేశం పంపారు” అంటూ శ్రీ గురూజీ వారుపంపిన సందేశాన్ని ఇలా చదివి వినిపించారు:
“భారతదేశే సనాతన-- -సంస్కృతి- -రక్షణార్థం రాష్ట్రీయ- స్వయంసేవక- సంఘ నామానం సమాజం సంసాప్య మహాన్తముపకారమ్‌ ఆరచితవతః శ్రీ కేశవ-బలిరామ -హెడ్‌గెవార్‌- మహోదయస్య సంస్మారకత్వేన నాగపురే తత్సంఘ నిర్వాహకైః శ్రీ గోళ్వల్మర్‌- మహోదయాదిఖిః ఏకం మందిరం నిర్మాయ తస్యోద్దాటనమ హోత్సవః అచిరాత్‌ సంవత్స్యత ఇతి విదిత్వా భృశం సంతుష్యామః।।  
ఏతన్మందిరం శ్రీ హెడ్‌గెవార్‌- మహోదయస్య స్వధర్మాచరణ విశిష్టం త్యాగమయం రాష్టసమున్నత్యర్థమర్చితం జీవనం సంస్మారయత్‌ సర్వేషామపి భారతీయానం తన్మార్గానుసరణే ప్రదీపాయతాం ఇతి || ”
ఈ సందేశంయొక్క హిందీ అనువాదాన్నికూడా శ్రీ గురూజీ చదివారు. సంకేశ్వర పీఠానికి చెందిన శ్రీ శంకరాచార్యులు, విశిష్టాద్వైత మతాచార్యులు శ్రీ రాఘవాచర్యజీ, వారణాసికి చెందిన శ్రీ రాజరాజేశ్వర శాస్త్రీ ద్రవిడ, లోకనాయక్‌ బాపూజీ ఆణే, స్వాతంత్ర్యవీర తాత్యారావ్‌ సావర్శర్‌, నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యశ్వంతరావ్‌ చౌహాన్‌లు పంపిన సందేశాలుకూడా చదవబడ్డాయి. ఆ తర్వాత స్మృతి మందిర నిర్మాణం యొక్క చరిత్రను చెపుతూ శ్రీ గురూజీ ఒక గంటసేపు ఇలా ధారాఫప్రవాహంగా ఉపన్యసించారు ;

పరమపూజనీయ శ్రీ గురూజీ ప్రసంగము »»

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top