1962 దాక్టర్‌జీ స్మృతిమందిర నిర్మాణ ప్రారంభోత్సవంలో పరమ పూజనీయ శ్రీ గురూజీ ప్రసంగం - Speech by Shri Guruji at the Inauguration Ceremony of Doctorji Memorial Hall - 1962

Vishwa Bhaarath
0
1962 దాక్టర్‌జీ స్మృతిమందిర నిర్మాణ ప్రారంభోత్సవంలో పరమ పూజనీయ శ్రీ గురూజీ ప్రసంగం - Speech by His Holiness Shri Guruji at the Inauguration Ceremony of 1962 Doctorji Memorial Hall -

పరమ పూజనీయ శ్రీ గురూజీ ప్రసంగం

“పరీక్షలవల్ల నేడు అనేకమంది స్వయంసేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. ఆ పరీక్షలు లేనిపక్షంలో ఇక్కడ ఉపస్థితులైన స్వయంసేవకుల సంఖ్యకు కనీసం రెండున్నర రెట్లు సయంసేవకులు ఉపస్థితులై యుందేవారు. కాని ఉగాది పర్వదినం పూజనీయ దాక్టర్‌జీ జన్మదినం కావడంవల్ల ఇదే రోజున స్మృతి మందిరం ఆవిష్కరణకు ముహూర్తం నిశ్చయించబడింది. స్మృతిమందిరం నిర్మాణంవల్ల, దాని ఆవిష్మరణవల్ల మనం వ్యక్తి ఆరాధకులమని ఎన్నటికీ అర్ధం చేసుకోకూడదు. సంఘ కార్యంలో సంఘంయొక్క జన్మదాత సర్వాధికంగా గౌరవించబడేవ్యక్తి. అయితే ఆయనకు మనం ఎన్నడూ జయ జయ ధ్వానాలు చేయలేదు. జయ జయ ధ్వానాలు చేయాలంటే రాష్ట్రానికి చేయాలి. భగవానునికి చేయాలి. మాతృభూమికి చేయాలి, వ్యక్తికి కాదు. అయినా- కొందరు పురుష పుంగవుల జీవితం అలౌకికంగా ఉంటుంది. వారి జీవితం తమ శరీరానికే పరిమితంకాక సిద్ధాంతంతో వఏకరూపతను పొందుతుంది. దాక్టర్‌జీ జీవితం అట్టిది. ఎన్నో రోజులుగా ఆయనకూ, శరీరానికీ సంబంధం ఏదీ లేదని చెప్పడం అనుచితం కాదు. జ్వరంతో ఉండి కూడా విసుగూ, విరామంలేకుండా ఆయన కృషి చేయడం, పర్యటన చేయడం దీనికి నిదర్శనం. అంతటి జ్వరంతో వారు ఎలా పర్యటన చేయగలిగే వారని చాలాసార్లు ప్రజలకు ఆశ్చర్యం కలిగేది డాక్టర్‌ జీయొక్క జీవితం సిద్ధాంతంగా మారిపోయింది. సునిశ్చితమైన ధ్యేయంకోసం శరీరాన్ని మనస్సును బుద్ధిని అంతటినీ సమర్పించడంవల్ల శరీరం ఆ సిద్ధాంతానికి, ఆ తత్వానికి కేవలం వాహకంగా ఉండిపోయింది. ఇలా తత్వరూపమయిన పార్ధివ శరీరాన్నిగురించి ఆలోచించడం తత్వచింతనతో సమానమైనదే.
     “శుష్మమైన తత్వచింతనవల్ల మనస్సు అటూ-ఇటూ తిరుగుతూ ఉంటుంది. బుద్ధి చాలాసార్లు పనిచేయకుండా పోతుంది. స్ఫూర్తిదాయకమైన ఒక అవలంబం, ఒక ఆశ్రయం దొరికినప్పుడు తత్వచింతన సులభమవుతుంది. ఏ ఆధారమూ లేకుండా వ్యాపకము, మహత్తరము నయిన శక్తియొక్క అనుభూతి అసంభవం కాకపోయినా కఠినమైనది, కాళికాదేవియొక్క లేక దుర్గాదేవియొక్క స్వరూపం కళ్ళముందు రాగానే ప్రళయ భయంకరమైన ఒక శక్తి కొంత అనుభవంలోనికి వస్తుంది. మనం డాక్టర్‌జీయొక్క కార్యాన్ని స్వీకరించాము. ఆ సిద్ధాంతం హృదయానికి హత్తుకునేటట్లు చేసుకుని దానికి అనుగుణంగా మన జీవితాలను తీర్చిదిద్దుకోవడానికై వారి భావనలకు సమానమైన భావనలతో మన హృదయం పొంగి పొరలేటట్లు చేసుకోవడం అవసరం. వట్టిమాటలు దానికి సాయపడలేవు. కనుక ఆలోచనకు ఒక ఆధారం అవసరమవుతుంది.

   “దాక్టర్‌జీ మనకు అందించిన కార్యానికై ఎట్టి మానసికస్థితి ఆశించబడుతోంది? సువిశాలమైన హిందూ సమాజాన్ని సంఘటితపరచమని వారు మనకు చెప్పారు. మన సమాజంలో వ్యక్తిగతమైన వివేకానికి, కార్యశక్తికీ కొరవలేదు; అయితే సామాజికంగా ఆ వివేకము, ఆ కార్యశక్తి అనుభవంలోనికి రావడంలేదు. ఈ కారణంవల్లనే ప్రపంచంలో మన జీవనానికి ఉన్నతికాని, రక్షణకాని, సుఖంకాని లేవు. బుద్ధి కుశలత, నిర్వహణ సామర్థ్యం, భావనలు వేర్వేరు మార్గాలలో పనిచేస్తున్నాయి. నలుగురు వ్యక్తులు కలసి పనిచేయడం సాధ్యపడనంతగా స్వార్ధంలో మునిగి ఉన్న సమాజంయొక్క జీవనంలో ఎన్నడూ సుఖసమృద్ద్ధులు ఉండవు. అది పరాజయాలతోను, పారతంత్యంతోను బంధించబడిన నికృష్ట్ణపు (బ్రతుకును వెళ్ళదీయవలసి వస్తుంది. అట్టి సమాజంలో ఒక వ్యక్తి బుద్ధికీ, కార్యశక్తికీ మరొక వ్యక్తి బుద్ధికీ, కార్యశక్తికీ సమన్వయం కుదురదు. సంఘటిత జీవనంద్వారానే ఈ సమన్వయం ఈ మేళవింపు ఏర్పడుతుంది.
    “ఒక ప్రత్యేకమైన మూసలో పోసిన జీవనాన్ని నిర్మించాలనే అర్థం దీనిలో ఎంతమాత్రంలేదు. నేడు ఈ విధంగా ఒకే మూసలో వ్యక్తిని కట్టి పడవేసే ప్రయోగం విదేశాలలో జరుగుతోంది. భాషను, పనిని భావాలను ఒక ప్రత్యేకమైన మూసలో బిగించి, ఒకే వ్యక్తి ఆదేశానుసారం అందరినీ నడిపించాలనే ప్రయత్నం జరిగే దేశంలో భీతావహంతో కూడిక ఒక విధమైన వాతావరణం ఉంటుంది. పెద్ద పెద్ద దేశాలలో *'బ్రెయిన్‌ వాషింగ్‌ పేరిట సద్దుణాలన్నిటినీ తుడిచిపెట్టే ప్రయత్నం జరుగుతోంది. మన దేశంలోకూడా దానిని అనుకరించే ధోరణి కానవస్తోంది. అందరి జీవితాలను ఒకే ఒక అచ్చులో బిగించి ఉంచడం మన సంస్కృతికి విరుద్ధం. అచ్చులో బిగుసుకుపోయిన ఇట్టి జీవనం మన పరంపరలో నికృష్టంగా, వర్ణించదగినదిగా పరిగణించబడింది. అందరి రంగు, అందరి ముక్కులు, చెవులు ఒకేవిధంగా ఉంటే, వాటిలో తేడా అనేది లేకపోతే, ప్రజల ఒకరి నొకరు చూసుకుని విసుగెత్తిపోతారు. ఒక్కొక్కరి ప్రతిభ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వైవిధ్యాన్ని చూసినప్పుడు మనస్సు ప్రసన్న మవుతుంది. అనేకత్వంవల్ల జీవనంలో సరళత ఏర్పడుతుంది.
    “ఉదాత్తమైన ధ్యేయాన్ని సాధించడానికి స్నేహసూత్రంతో బంధించబదడడం అవసరం. తమ తమ బుద్ధినీ, శక్తినీ అనుసరించి సమాజాన్ని అభివృద్ధి పరచడంలో నిమగ్నమయే ప్రవృత్తిని నిర్మించే పనినే సమాజంతో తాదాత్య స్థితిని పొందడమని అంటారు. ఈ తాదాత్యస్థితి నిర్మాణం కాగానే సుఖసమృద్ధులకు అవసరమైన చైతన్యవంతము, సంఘటితము అయిన స్వరూపం సమాజానికి సిద్ధిస్తుంది. సుసంఘటితము, చైతన్యయుక్తము నయిన జీవనంలోనే సుఖసమృద్ధులు వెల్లివిరుస్తాయి. ఈ తాదాత్మ్యస్థితి మాటల గారడీవల్ల లభించదు. 'సమాజంలోని ఏ వ్యక్తీ నాకు భిన్నమైన వాడు కాడు. ప్రతి వ్యక్తీ నా శరీరంలోని ఒక భాగం; నావలె అతడుకూడా ఈ మాతృభూమికి పుత్రుడు ఈ మాతృభూమియొక్క మట్టినుండే అతని శరీరంకూడా ఏర్పడింది. వేలాది ఏండ్లనుండి అఖండంగా వస్తూన్న ఏ సంస్కార పరంపరలో నా హృదయం మలచ బడిందో అదే సంస్కార పరంపరలో అతని హృదయంకూడా మలచబడింది. మన సుఖదుఃఖాల అనుభవాలు ఒకటే. పైకి కనబడే కొద్దిపాటి భిన్నత్వంవల్ల ఏకాత్మతలో అణుమాత్రమయినా లోటు కలగడం అసంభం” - ఈ సత్యంయొక్క అనుభూతి ప్రతి వ్యక్తికి కలిగేందుకై కృషి చేయడానికి పేరణ పూజనీయ దాక్టర్‌జీ జీవితంనుండి లభిస్తుంది.

    ఏడు రంగులూ కలసి స్వచ్చమైన ధవళవర్హం ఏర్పడే విధంగా ఆహార విహారాలు, భాష్క వేషభాషలు ఇత్యాది వైవిధ్యాలు కలసి మన జీవనం ఏకాత్మతా రూపంలో ప్రకాశిస్తుంది. దీని పేరు భావ సమైక్యం. ఈ ఏకత్వం బేరాలవల్ల, రాజీలవల్ల నిర్మాణం కాదు. భావ సమైక్యానికి ఆధారస్తంభం హృదయాలలో సమానమైన భావనలు ఉండడం. తీవ్రమైన ఆలోచన ద్వారాను, సన్నిహితమైన సంపర్మ్శం ద్వారాను మాత్రమే ఈ భావన అనుభవంలోకి రావడం సాధ్యమవుతుంది. అందరికీ ఈ అనుభూతి కలిగే విధంగా సంఘకార్యం నిర్మించబడింది. వైవిధ్యంలో ఏకత్వాన్ని దర్శింపజేసే సంఘంయొక్క కార్యపద్ధతి సాటిలేనిది. దైనందిన శాఖా కార్యక్రమంలో వ్యక్తి లీనమవుతాడు; అతని హృదయంలో ఏకత్వ భావన మేలుకొంటుంది. 
    నేడు దేశంలో అనేక సంస్థలు నడుస్తున్నాయి. దాదాభాయి నౌరోజీ, మహాత్మాగాంధీ, పండిత నెహూలవంటి విశ్వవిఖ్యాతి పొందిన వ్యక్తులు నడిపిన సంస్థలో వర్గవిభేదాలు, భాషాభేదాలు ఆధారంగా ముఠాల సంఘర్షణ కానవస్తోంది. ఈ పెద్ద సంస్థను అనుకరించే ఇతర పక్షాలలో కూడా ముఠాకక్షలనే అవలక్షణం చరమస్తాయికి చేరుకున్నది. ఈ సంస్థలలో దుర్గుణాలను అలవరచుకోవడంలో పోటీ ఏర్పడిందా అనిపిస్తోంది. నాయకులు భావసమైక్యాన్ని నిర్మించడానికి, పథకాలు వేస్తున్నారు; కాని విచ్చిన్నత విలయతాండవం చేస్తోంది. విచ్చిన్నకర ప్రవృత్తులతో రాజీపడి వారు ఓటమిని విజయంగా మార్చడానికి యత్నిస్తున్నారు. 
    సంఘంలోకి వచ్చేవ్యక్తులకు డాక్టర్‌జీ ఒక అసాధారణ వ్యక్తి అని ఎన్నడూ అనిపించేది కాదు. కాని సంఘంయొక్క కార్యపద్ధతిని నిర్మించడంలో వారి అసాధారణత్వం ప్రకటిత మయింది. విద్యాగంధంలేని వ్యక్తినుండి ప్రకాండ పండితునివరకు అందరినీ ఒక చోటికి చేర్చి, తాము వేర్వేరనే భావన ఏ ఒక్కరికీ కలుగనీయని కార్యపద్ధతి ఇది. ఆటలు ఆదదం, శారీరకమైన వ్యాయామం చేయడం, పాటలు పాడడం, ఒకరి కొకరు సహాయపడడం ఒకరి సుఖదుఃఖాలలో మరొకరు పాల్గొనడం- ఇదే దైనందిన కార్యక్రమాల స్వరూపం. ఎంతో తేలికైన, సుళువయిన ఈ దైనందిన కార్య పద్ధతి ద్వారా శరీరానికీ, మనస్సుకూ పొంతన ఏర్పడుతుంది. ఆలోచనలో సమన్వయం ఏర్పడుతుంది. దీనిలోనుండి రాష్ట్రభక్తి మాతృభక్తి ఉదయిస్తాయి. అవి సమాజ మంతటిలో వ్యాపిస్తాయి. ఈ పని ఎంతో కష్టమైనది. అయితే డాక్టర్‌జీ ఏర్పరచిన కార్యపద్ధతికూడా అంతే తేలికైనది. దీనిలోనే వారి అలౌకికశక్తి ప్రకటిత మయింది. ప్రాచీన కాలంలో శ్రీకృష్ణభగవానుడు పరమేశ్వర సాక్షాత్మారానికి ప్రతిమానవుడూ సులభంగా అనుసరించ దగిన మార్గాన్ని చూపాడు. ఆధునిక కాలంలో పరమేశ్వర సాక్షాత్మారానికి సుళువైన, తేలికైనమార్దాన్ని భగవాన్‌ శ్రీ రామకృష్ణ పరమహంస చూపాడు. నేటి యుగంలో రాష్టరూపంలో ఉన్న పరమేశ్వరునితో తాదాత్మ్యాన్ని పొందడానికి అతిసరళమైన మార్గాన్ని పూజనీయ దాక్టర్‌జీ చూపారు. ఈ మార్గం సరళమే అయినా రాష్ట్రానికి అమరత్వాన్ని ప్రసాదించేది కావడంలోకూడా ఆయన అలౌకికత్వం ఇమిడి ఉన్నది. ప్రజలకు ఆయన జీవితం అతి సామాన్యంగా కనబడేది. నేడు కూడా సమాజమంతటికీ ఆయన అలౌకికత్వం తెలియదు. అయితే భవిష్యత్తులో ప్రపంచమంతా ఆయన అలౌకికత్వం గుర్తించడం నిస్సంశయం.

     పాశ్చాత్య జీవన విధానాన్ని అనుకరించే మనస్తత్వం కారణంగా సామాజిక  కార్యకర్తల వ్యక్తిగత జీవితంలోకి చూడకూడదనే ఒక భావన నేడు బలపడుతోంది. కాని ఈ ధోరణి మన సంప్రదాయానికి విరుద్ధమైనది. వ్యక్తిగత జీవితాన్నీ సామాజిక జీవితాన్ని వేరుచేయడం మన సంప్రదాయం కాదు. చెప్పేదానికీ, చేసేదానికీ గల పొంతననే పూజనీయంగా పరిగణించింది మన సంప్రదాయం. శీలంలేని వ్యక్తి చేసే ఉపదేశాలు సమాజంపై ఎట్టి ప్రభావాన్నీ కలిగించలేవు. “కైసిస్‌ ఆఫ్‌ కారెక్టర్‌” సౌశీల్య సమస్య ఏర్పడిందని మన నాయకులు నేడు చెప్పుచున్నారు. డాక్టర్‌జీ ఎన్నడూ వట్టి ఉపదేశాలు చేయలేదు. జాతీయజీవనంలో ఆయన శీలసంపన్నత, నిస్వార్ధ రాష్ట్రసేవ అనే ఆదర్శాలను నెలకొల్పారు. రాష్ట్రం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమే. మన భరతమాత సాక్షాత్తు జగజ్జనని. భ్రష్టమైన శరీరంతో ఆమెను ఆరాధించడం సాధ్యమా భి జగజ్జనని అయిన మాతృభూమిని ఆరాధించడానికి జీవితంలో లోపలా బయటా శుచిగా ఉండడం అవసరం. *నేను ఈ రాష్ట్రదేవుని ఆరాధకుడను” అని రాత్రింబవళ్ళు భావనచేస్తూ దుర్గణాలను తొలగించుకుని మన జీవితాన్ని పవిత్రం చేసుకోవాలి. పూజనీయ దాక్టర్‌జీ యొక్క అంతర్చాహ్య విశుద్ధమైన ఆచరణ మన ముందున్నది. ఆయన కామినీ కాంచనాల ప్రభావానికి అతీతుడు. సత్యసంధత, నిజాయితీ, విశుద్ధమైన శీలం, దృఢత్వం ఇత్యాది సద్దుణాలలో కూడిన నిర్విరామమైన రాష్టసేవకు ప్రత్యక్ష ఉదాహరణ తమ కళ్ళఎదుట ఉన్న కారణాన వేలాది స్వయంసేవకులకు, ఇళ్ళూ వాకిళ్ళూ వదలిపెట్టి. ఉద్యోగాల వ్యామోహాన్ని కాలదన్ని రాష్ట్రసేవకై తమ సర్వస్వాన్నీ అర్పణ చేసేందుకు ప్రేరణ లభించింది. డాక్టర్‌జీ జీవితం రాష్ట్రసేవకై సర్వస్వాన్నీ సమర్పణ చేయడమనే గుణానికి సజీవమై, జ్వలించుచున్న ప్రతీకం. శత్రువు లన్నిటిపైనా ఆయన విజయాన్ని సాధించారు. అహంకారమనే శత్రువు ఎదుట మహాతపస్వులు కూడా గజగజ లాదతారు. కాని డాక్టర్‌జీ ఆ శత్రువునుకూడా జయించారు. సర్వశ్రేషులయిన గుణగుణాలను సంపాదించుకున్నప్పటికీ ఆయన జీవితంలో అహంకారం అణుమాత్రమయినా లేదు. గత రెండు శతాబ్దాలలో దేశానికి ఇంతటి స్వార్థరహితమైన సేవ చేసిన వ్యక్తి, ఇంత నిరహంకారి అయిన వ్యక్తి జన్మించలేదని చెప్పడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.
     డాక్టర్‌జీ జీవితం తత్వరూపాన్ని పొందింది. భవ్యము, స్ఫూర్తిప్రదము అయి రాష్టకార్యంతో తాదాత్మ్యాన్ని పొందింది. అనేకములైన సద్దుణముల శ్రేష్టత్వం ఆయన జీవితంలో సమీకరించబడింది. మహోత్తమమైన వారి జీవితంలోని అంశము మనంకూడా పొందగలగడానికీ, అక్షయమైన రాష్ట్రభక్తి భావనతో పొంగులువారే అంతఃకరణ వారికివలె మనకుకూడా లభించదానికీ, వారి జీవితాన్ని స్మరించడంవల్ల రాష్టంయొక్క నిరాకారరూపం సాకారమై వెలుగొందడానికీ, వారి జీవితం తరాల తరబడి అహర్నిశలూ వెలుగుబాట చూపుతూ ఉండడానికీ ఈ స్మృతి మందిరం నిర్మాణం జరిగింది. జాతికి ఏర్పడిన ప్రమాదాలన్నిటినీ తొలగించి, చిరంజీవి అయి, సుఖసమృద్ధులతో తులతూగి అందరి గౌరవాన్నీ చూరగొనే మహత్తరమైన రాష్టజీవనాన్ని నిర్మించే సామర్ధ్యం లభించడానికి ఈ స్మృతి మందిరం చిరంతనమైన స్ఫూర్తికేంద్రం కావడం నిస్సంశయం.”
     శ్రీ గురూజీ ప్రసంగం తర్వాత ధ్వజప్రణామ్‌, ధ్వజావరోహణం జరిగాయి. స్మృతి మందిరం ఆవిష్కరణ కార్యక్రమం సమాప్తమయింది. నాటి రాత్రి వరుణదేవునికి స్మృతి మందిరాన్ని అభిషేకించాలనే అభిలాష కలిగింది. ఆ కారణాన సంఘస్థాన్‌లో ఉన్న చాలామంది స్వయంసేవకులు తమ తమ నివాస స్థలాలకు వెళ్ళవలసివచ్చింది. లేని పక్షంలో మిత్రులను కలుసుకోవడం వారితో కబుర్లు చెప్పుకోవడం, స్మృతి మందిరాన్ని దర్శించడం-వీటితో వారు రాత్రంతా అక్కడే గడిపి ఉండేవారు. మరునాటి ప్రాతఃకాలం స్వయంసేవకులకు 'బౌద్ధిక్‌ వర్గు జరిగింది. దానిలో శ్రీ గురూజీ మార్గదర్శనం చేస్తూ ఒక గంటసేపు ఇలా ప్రసంగించారు :
బౌద్ధిక్‌ వర్గ
    “నిన్న స్మృతిమందిరానికి ప్రారంభోత్సవం జరిగింది. స్మారక నిర్మాణం జరిగినప్పటికీ- గొప్ప గొప్ప సాధువులకు, సంతులకు పూజ్యభావాన్ని వ్యక్తం చేయడానికి నిర్మితమయే సమాధులను గురించి ఆలోచించే విధంగా ఈ స్మృతి మందిరాన్ని గురించి ఆలోచించకూడదు. నవనిర్మితమైన ఈ స్మృతిమందిరం హిందూ సమాజమంతటికీ (శ్రద్దా కేంద్రమనేదీ, దీని గొప్పతనం నానాటికీ పెరుగుతూనే ఉంటుందనేదీ నిజమే. అయినా మనం దానిని కేవలం ఒక పూజాస్థానంగానే చేయకూడదు. డాక్టర్‌జీకి అట్టి పూజ ఎంతమాత్రం నచ్చదు. వారి చిన్నతనంలో ఒక సంఘటన జరిగింది; ఒకసారి ధార్మిక ప్రవృత్తి కలిగిన ఒక గృహస్తు వారి ఇంటికి అతిధిగా వచ్చాడు. వేకువనే స్పానాదులు ముగించుకుని ఆయన భగవద్గీత పారాయణ చేశాడు. పారాయణ పూర్తయిన తర్వాత ఆయన ఆ పుస్తకంపై పూలుజల్లి, భక్తి భావంతో దానికి నమస్కరించాడు. “గీతలో చెప్పబడిన మార్గాన్ని ఆచరణలో అనుసరించడానికి మీరు తప్పక ప్రయత్నిస్తు న్నారని తలుస్తాను” అని డాక్టర్‌జీ ఆయనను ప్రశ్నించారు. డాక్టర్‌జీ చెప్పిన ఈ మాటలకు కోపోద్రిక్తుడై ఆయన “భగవద్గీత పారాయణ గ్రంథం. ఆ పారాయణ వల్లనే మానవుని ఉద్ధరణ జరుగుతుంది” అని అన్నాడు. కాని సౌశీల్యాన్ని అలవరచు కోకుండా, సద్దుణాలను వికసింపజేసుకోకుండా కేవలం పూజ చేయడంవల్ల మానవుని ఉద్ధరణ జరుగుతుందని మన హిందూధర్మ గ్రంథాలలోకాని, మన సంప్రదాయంలోకాని ఎక్కడా చెప్పబడలేదు. చనిపోయేటప్పుడు తన కుమారుడైన “నారాయణని పేరు ఉచ్చరించినంత మాత్రాన అజామీళుడు మృత్యుపాశంనుండి విముక్తి పొందాడని చెపుతూ ఉంటారు. మరణ సమయంలో అజామీళుడు తన కుమారుడైన నారాయణుని పేరు ఉచ్చరించాడనీ, ఆ కారణంవల్లనే అతని ఉద్ధరణ జరిగిందనీ అజ్ఞానులు భావిస్తూ ఉంటారు. కాని వాస్తవం అదికాదు.
      “నారాయణ నామాన్ని ఉచ్చరించడంవల్ల మృత్యుపాశంనుండి విముక్తి కలగడం చూచినందువల్ల అజామీశునికి పాప పంకిలమైన తన జీవితానికి పశ్చాత్తాపం కలిగింది. నామస్మరణవల్ల మృత్యుముఖంనుండి మాత్రమే విముక్తి కలిగిందనీ, జనన మరణముల బంధనమునుండి శాశ్వతమైన విముక్తి పొందడానికై కఠోరమైన ఉపాసన చేయవలసి ఉందనీ గుర్తించి అతడు తన మిగతా జీవితాన్ని ఉగ్రమైన తపశ్చర్యలో గడిపాడు. శ్రమ పడకుండా ముక్తి లభిస్తుందని మన శాస్తాలుకాని, మన సంప్రదాయంగాని, మన సంస్కృతికాని ఎన్నడూ ఉపదేశించలేదు. వాస్తవానికి ఏ పూజాస్థలమయినా ఒక ప్రత్యేకమైన సిద్దాంతాన్ని స్మరింపజేసే స్ఫూర్తిదాయకమైన స్థలంగా ఉందాలి. ఆ పూజాస్థలంయొక్క దివ్యచైతన్యపు స్మృతి హృదయంలో జాగ్భృతంగా ఉంచుకొని, ఆ చైతన్యాన్ని ఎంత ఎక్కువగా హృదయంగమం చేసుకోగలిగితే అంత ఎక్కువగా పహృదయంగమం చేసుకొని అంతటితో తృప్తిపదక ఆ చైతన్యంతో పూర్తిగా సమరసం కావాలని, తన్మయం చెందాలని ఆకాంక్షిస్తూ, దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకోవాలనే సఫల ప్రయత్నం జరగాలి. దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకోవాలనే సఫల ప్రయత్నం జరగాలి. భావోన్నతి, పవిత్రత, సుగుణసంపద, విశాల హృదయం జీవితంలో ప్రతిబింబించు కోవాలనే ప్రయత్నం ఉన్నప్పుడే పూజాస్థలం సమీపానికి వెళ్ళడం సార్ధకమవుతుంది. శ్రద్దాకేంద్రంయొక్క సమీపానికి వెళ్ళి దానివలె మారడానికి మనం ఎంతగా ప్రయత్నిస్తే మన పూజ అంతగా సఫలమైనట్లు పరిగణించబడుతుంది.

డాక్టర్‌ జీయొక్క గుణాలను అన్నిటినీ వర్ణించడం అసంభవం. కనుక వారి జీవనంలోని కొన్ని ప్రముఖ విషయాలను గమనించడానికి ప్రయత్నిద్దాం. డాక్టర్‌జీ ఏకాగ్రమైన మనస్సుతో మన మాతృభూమినిగురించి, మన సమాజాన్నిగురించి, మన ధర్మ సంస్కృతులనుగురించి మన రామ్ర్రాన్నిగురించి రాత్రింబవళ్ళు చింతన చేశారు. ఉపాసనచేశారు. ఇది మినహా మరేవిషయానికీ తన జీవితంలో న్ధానం ఇవ్వలేదాయన. మనం ఈ దృష్టితో మన జీవితాన్ని పరిశీలించుకోవాలి. స్వార్థంవల్ల, మోహంవల్ల, పరిసర వాతావరణంలో వ్యాపించిన సిద్ధాంత సంఘర్షణవల్ల ఇతర ఆకర్షణలవల్ల మన మనస్సును చలించనీయకుండా, మన అంతఃకరణయొక్క సంపూర్ణ శక్తితో మన మాతృభూమినిగురించి, సమాజంగురించి, స్వధర్మ్శంగురించి, చిరంజీవి అయిన మన రాష్ట్రజీవనంగురించి చింతన చేయడంలో మన జీవనం తన్మయత్వం చెందాలి. ఏకాగ్రమైన మనస్సుతో చేసే ఈ చింతన ఫలితంగా మన మనస్సు చెడు విషయాల పైకి పోదు. పరమేశ్వరుని వ్యక్తస్వరూప మయిన మన పవిత్ర రాష్ట్రంయొక్క చింతనలో తన్మయం చెందిన జీవితంలో దురాలోచనకు, అవినీతికి, పాపానికి తావుండదు. సమాజ మంతటియొక్క అభ్యుదయానికై పనిచేయాలంటే మన జీవితం పవిత్రంగా ఉండితీరాలి. ఏకాగ్ర చిత్తంతో చేయబడిన రాష్టచింతనద్వారా సహజంగా నిర్మలము, మంగళమయము నయిన జీవితం నిర్మాణ మవుతుంది. డాక్టర్‌ జీయొక్క జీవనం లోపలా బయటాకూడా పవిత్రము, విశుద్ధము అయినది. ఆయన దానిని తన రాష్ట్రయొక్క సర్వతోముఖమైన చింతనకు అంకితం చేశారు. వారిజీవనంలోని పవిత్రత, తేజస్సు మన జీవితంలోనికి తెచ్చుకోవడానికి మనం కృషి చేయాలి.

    జాతి అభ్యుదయానికై దాక్టర్‌జీ చూపిన మార్గాన్నికూడా మనం స్మరించుకోవాలి. నేటి పరిస్థితిలో ఇది అత్యావశ్యకం. వారు సంఘకార్యానికి అనుకూలమైన చాలా తేలికైన ఒక పద్ధతిని మనకు ఇచ్చి వెళ్ళారు. జాతిలోని దోషాన్ని కనుగొన డమేకాక దానికి చికిత్సనుకూడా వారు సూచించారు. అసంఘటిత స్థితి, ఆత్మవిన్మృతి, పరస్పర స్నేహం లేకపోవడం - ఇవే సమాజంలో ఉన్న దోషములనీ, వాటిని నిర్మూలించడానికి సుసంఘటితమై, ఏకాత్మత కలిగిన రాష్ట్ర స్వరూపంయొక్క సాక్షాత్మారంవల్ల జాగరితమైన జీవనాన్ని నెలకొల్పాలనీ వారు చెప్పారు. చికిత్సకు ఉపాయాన్ని తెలిపిన తర్వాత వారు దానిని అమలు పరచడానికి అనువైన పద్ధతిని శాఖరూపంలో చూపారు. సంఘటితము, ఏకాత్మకము, ప్రబలము నయిన రాష్ట్ర జీవనాన్ని నిర్మించడానికి ఏకైక ఉపాయం ఇదే. ఏకాగ్రమైన నిష్టతో దానిని అవలంబించడంద్వారా మనం రాష్ట్ర-అభ్యుదయంకోసం సమాజంయొక్క సంఘటితశక్తిని నిర్మించగలుగుతాము. ఇలా పని చేస్తున్నప్పుడు మన నలువైపులా నడుస్తున్న కార్యక్రమాలయెడ ఆకర్షణ ఉండడం అసహజ మేమీకాదు. ఊరేగింపులు, సమ్మేళనాలు, మహాసభలు ఇత్యాది కోలాహలం ఉండేచోట మనస్సుకు చక్కిలిగింత పెట్టినట్లు ఉంటుంది. ఆ కార్యపద్ధతిలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. 
     కనుక మనలో కొందరికి దానియెడ ఆకర్షణ జనించి, ఆ గోదాలోనికిదిగి తొడ కొట్టాలనే కోరిక కలుగవచ్చు. మనస్సులో ఇట్టి కోరిక కలుగగానే “ఇలాంటి పనివల్ల జాతికి ప్రయోజనం కలుగుతుంది” అనే వాదాన్ని సమర్థించడానికి బుద్ధి ఎన్నో తర్మాలను ప్రయోగిస్తుంది. వాదాన్నీ ప్రతివాదాన్నీ రెంటినీ సమర్థిస్తూ తర్మాలను ప్రయోగించడం బుద్ధికి చేతనయిన పనే. ఎన్నికల సమయంలో ఒక వ్యక్తి నాతో “ఎన్నికలు, రాజకీయాలు మాత్రమే రాష్ట్రసేవకు అత్యుత్తమమైన మార్తాలిని అన్నాడు. ఎన్నికలు, రాజకీయాలు అత్యుత్తమమైన అత్యుత్తమమైన మార్గాలని అన్నాడు. ఎన్నికలు, రాజకీయాలు అత్యుత్తమమైన మార్గములని భావించడం సముచితం కాదని నేను ఆయనతో అన్నాను. దేశభక్తిని ఉగ్గుపాలతోనే అలవరచుకునే సంప్రదాయం కలిగిన ఇంగ్లండువంటి దేశంలో ఇవన్నీ శోభిస్తాయి. మన దేశంలో రాష్ట్రభక్తి భావన కొందిమందికే పరిమితమై వుంది. వారిలోకూడా కీర్తికండూతితో, పదవీ వ్యామోహంతో రాష్ట్రకార్యం చేస్తున్నవారు ఉన్నారు. ఒకసారి డాక్టర్‌జీకి ఒక పెద్దమనిషిని 'దేశభక్తుడని పరిచయం చేయగా, డాక్టర్‌జీకి అది నచ్చలేదు. ఒక వ్యక్తిని ప్రత్యేకంగా దేశభక్తుడని పరిచయం చేయడమంటే ఇతరులు దేశభక్తులు కారని పరోక్షంగా అంగీకరించదమే. వాస్తవానికి ఒక దేశంలో కొందరే దేశభక్తులు ఉండడం, మిగలవారికి దేశభక్తి లోపించడం మంచి విషయంకాదు. దేశంలో ప్రతి పౌరుడూ సహజంగా దేశభక్తుదే అయిఉండాలి. దేశభక్తుడని ప్రత్యేకంగా ఎవరినీ పరిచయం చేయవలసిన అవసరం రాకూడదు. ఒక వ్యక్తిని పరిచయం చేసేటప్పుడు మనం అతను 'మనిషి అని చెప్పం- అందరివలె అతనికీ కళ్ళు, ముక్కు చేతులు, కాళ్ళు ఉన్నాయేగాని, తోకకాని కొమ్ములుకాని అతనికి లేవుకదా! అదేవిధంగా ప్రతి వ్యక్తీ సహజంగానే దేశభక్తుడై ఉండాలి” అనే విషయాన్ని అంగీకరించినప్పుడు అతడు దేశభక్తుడని ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. పుట్టుకనుంచే వచ్చే
సంస్కారాలవల్ల దేశభక్తి ప్రతి వ్యక్తి హృదయంలోనూ అంకురించి, వికసించే సమాజంలో, స్వార్ధాన్ని వదిలివేసి రాష్ట్రంకోసం సర్వస్వాన్నీ అర్చించే ప్రవృత్తి స్థిరపడిన సమాజంలో, సూత్రబద్ధమైన జీవనం నిర్మాణమైన సమాజంలో ఎన్నికలు, రాజకీయాలు ఇత్యాదులు సమాజంలోని సుఖశాంతులను అభివృద్ధిపరచడానికి కారణభూతములవుతాయి. బలిష్టమైన శరీరంపైన వస్త్రాలు, అలంకారాలు శోభించినట్లుగా కట్టెవలె ఎండిపోయిన శరీరంపైన శోభించవు. రోగగ్రస్తమైన శరీరం పరమాన్నం జీర్ణం చేసుకోలేదు; పరమాన్నం జీర్ణం చేసుకోవడానికి బలిష్టము, రోగరహితము అయిన శరీరం అవసరం. అదే విధంగా శక్తిమంతము, రోగరహితము, బలీయము అయిన రాష్ట్రజీవనం ఉన్నప్పుడే ఎన్నికలు, రాజకీయాలవంటి అలంకారాలు శోభిస్తాయి; వాటివల్ల ఆ రాష్ట్రంయొక్క సుఖం, సౌందర్యం పెరుగుతాయి; అవి అందరికీ ఉపయోగకరంగా పరిణమిస్తాయి.

     ప్రతి వ్యక్తి జీవితంలోనూ మాతృభూమియెడ భక్తిని మేలుకొలిపి ఆ సూత్రంతో సమాజమంతటినీ బంధించి, సమాజంయొక్క సంఘటిత సామర్య్యాన్ని నిర్మించడమనే మౌలిక కార్యాన్ని డాక్టర్‌జీ మన ముందుంచారు. ఈ కార్యంకొరకే మనం మన యావచ్చక్తినీ ధారపోయాలి. శాఖలద్వారా సమాజంలో ఏకాత్మ జీవనాన్ని నిర్మించే పద్ధతిని పూర్తిగా అవలంబించి, ఈ కార్యసిద్ధికై మన శక్తి అంతటినీ అంకితం చేయాలనే దృఢనిశ్చయాన్ని పూనవలసివుంది. దానికై ఈ స్మృతిమందిర దర్శనంద్వారా తేజస్సుతోను, రాష్ట్రభక్తితోనూ తొణికిసలాడే దాక్టర్‌జీ జీవనంవంటి జీవితాన్ని నిర్మించుకోవాలనే 'పేరణను మనం పొందవలసివుంది. అలా జరిగిననాడు ఈ స్మృతి మందిర నిర్మాణానికి చేసిన కృషి సార్థక మవుతుంది. 
    ఒక పూజాస్టలాన్ని నిర్మించి మనం దానికి పీఠాధిపతులము కావాలనే మనస్తత్వంతో ఈ స్మృతి మందిర నిర్మాణం జరుగలేదు. ఇటుకలతో, రాళ్ళతో నిర్మింపబడే వస్తువులపై నాకు అఖీరుచి లేదు. అయినా నాకీ స్మృతిమందిరం కావాలి. ఎందువల్లనంటే ఈ స్థలం అత్యంత పవిత్రమైనది. సంఘ సంస్థాపకులు సంచరించిన స్థలం, మన సంఘ కార్యంకోసం తన రక్తం నీరుగా చేసుకున్న స్థలం, చివరకు దీర్హ నిద్రకై తన శరీరాన్ని వదలిన పవిత్ర స్థలం. మన జీవితాన్ని వారి జీవితంవలె రూపొందించుకోవడానికి కావలసిన ప్రేరణ మనకు ఇవ్వాలనే ద్ధాపూర్వకమైన భావనతోనే మనం ఈ స్మ లత మందిరాన్ని చూడవలసివుంది.”
   బౌద్ధిక్‌ వర్గ తర్వాత స్వయంసేవకులలో చాలామంది మళ్ళీ ఒకసారి తనివితీరా స్కృతిమందిరాన్ని దర్శించుకుని తమ తమ కార్యక్షేత్రాలకు తిరిగి వెళ్ళే ప్రయత్నాలలో నిమగ్నమయారు.

స్వయంసేవకులు అందరినీ కలుసుకుని సెలవు తీసుకున్నారు. వారి  మనోనేత్రముల ఎదుట ప్రారంభోత్సవంలోని వివిధ ఘట్టములచిత్రం నాట్యం చేస్తోంది. ఏ మహాపురు షనికి (శ్రద్ధాంజలి ఘటించడానికి తాము నమావేశమయినారో ఆ మవాీపురుషుడు నిరెశించిన మార్గంలో అనవతరంగా పురోగమించాలనే దృఢ నిశ్చయపు జ్యోతి అందరి అంతఃకరణాలలో వెలుగొందుతోంది.

Post a Comment

0 Comments


Post a Comment (0)
Translate to your Language!

"విశ్వభారత్" జాలిక లాభాపేక్ష లేకుండా నడపబడుతున్నది. జాతీయవాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మీ వంతు సహాయం చేయండి.  ;

Supporting From Bharat:

 

Notice : The source URLs cited in the news/article might be only valid on the date the news/article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the sources website and search for the news/article.

Disclaimer : The news/article published are collected from various sources and responsibility of news/article lies solely on the source itself. Vishwa Bhaarath (VB) or its website is not in anyway connected nor it is responsible for the news/article content presented here. ​Opinions expressed in this article are the authors personal opinions. Information, facts or opinions shared by the Author do not reflect the views of VB and VB is not responsible or liable for the same. The Author is responsible for accuracy, completeness, suitability and validity of any information in this article. ​

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies. Learn
Accept !
To Top