శక్తి ఉన్న సహృదయులు తప్పక స్పందించండి

ఈ ఫోటోలో ఉన్న అతని పేరు శ్రీ నక్కపల్లి భరత్ కుమార్ శర్మ. కడప జిల్లా జమ్మలమడుగు మండలం ధర్మాపురం గ్రామవాసి. వయస్సు 30 సంవత్సరాలు. అవివాహితుడు. ఒక అవివాహితురాలైన చెల్లెలు ఉన్నది.
ధర్మాపురంలో జన్మించిన ఈ యువకుడు 12వ తరగతి వరకు చదివాడు. ఆ సమయంలోనే తండ్రిగారు అవయవ వైఫల్యం వల్ల మృతి చెందారు. (Dead due to organ failure) నాటి నుండి తల్లిని చెల్లిని చూసుకోవాలి కాబట్టి పౌరోహిత్యంలో కొంత నేర్చుకుని కుటుంబ పోషణ నిమిత్తం పురోహిత వృత్తిని స్వీకరించాడు. ఆ తరువాత కొంతకాలానికి తల్లి కూడా గతించారు. పెళ్ళి కాని చెల్లెలు ఇతడు చక్కగానే కష్టపడి జీవిస్తూ ఉండగా ఒకనాడు పెళ్ళి చేయించి బైకు పైన వస్తూ ఒక టిప్పరు వల్ల ప్రమాదం జరిగి తీవ్రమైన గాయాలతో స్పృహ కోల్పోయాడు.
కొంతసేపటి తరువాత ఎవరో వచ్చి ఆసుపత్రిలో చేర్చారు. అతడు హెల్మెట్ ధరించి ఉండడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ముఖ్యంగా కుడికాలు మరియు కుడిచేయికి ఈ ప్రమాదంలో ఎక్కువగా గాయాలయ్యాయి. ఇతడు మళ్ళీ పూర్వం వలె చక్కగా తిరుగుతూ సంపాదించుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. యుక్తవయస్కుడే కావున పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. బంధుమిత్రులు కొంతవరకు సహాయం చేసి ఆదుకున్నారు. పూర్తి స్థాయి సహాయాన్ని మన నుండి అతడు అర్థిస్తున్నాడు. హిందూ ధర్మక్షేత్రం తరపున కొంత సహాయం చేస్తున్నాం. మన హైందవ మిత్రుల్లో శక్తి ఉన్న సహృదయులు వీరికి సహాయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను.
🕉️₹₹₹₹₹🕉️
అకౌంట్ వివరాలు
- Bank Name : Canara Bank
- Account No : 31932250025957
- Name : N Bharat Kumar
- IFSC Code : CNRB0005701
- Branch : Jinna Raod, Prodduturu
- Phonepe - Gpay : 8978364263
- UPI ID : 8978364263-6@ybl
UPI లిమిట్ అయిపోతే ఫోన్ పే గూగుల్ పే మరియు ఇతర మార్గాల్లో నేరు అకౌంట్ వివరాలు అవీ పెట్టి వేయవచ్చు. గమనించగలరు
సహాయం చేయలేని వాళ్ళు షేర్ చేయడం కూడా ఒక సహాయమే. సహాయం చేసి వేరే వాళ్ళకు చేయమని చెప్పేవారు రెండు సహాయాలు చేసినట్టు లెక్క. స్వస్తి
మీ సంతోష్ ఘనాపాటి - ఋగ్వేదం అధ్యాపకులు.


.jpeg)

.jpeg)
.jpeg)

.jpeg)

