సేవలో వ్యక్తి సహజగుణము - స్పందించే హృదయము: RSS instinct in service - responsive heart

సేవా - స్పందించే హృదయము
సేవా - స్పందించే హృదయము

మార్గదర్శనం:
కీ.శే. కృ.సూర్యనారాయణరావు

వ్యక్తి సహజగుణము - స్పందించే హృదయము
తన కష్ట సుఖాలను ఇతరులతో పంచుకోవాలనే ప్రత్యేక గుణాన్ని భగవంతుడు మానవునికి ప్రసాదించాడు. ఉదా : ఒకరి ఇంట్లో కుమారుని వివాహము సందర్భంగా అతడు విందుభోజనం తయారుచేయించి అందరికి పెడ్డాడు. అందులో ఎంత ఖర్చయినా అతనికి బాధ అనిపించదు. అతని మనసులో కుమారుని పెండ్లిగురించి కలిగిన అపారమైన సంతోషమును ఎంతోమందికి భోజనం పెట్టడం ద్వారాపంచుకోవాలని ప్రయత్నిస్తాడు. అదేవిధంగా ఒక వ్యక్తి ఇంట్లో ఎవరోజకరు చనిపోయినపుడు లేదా మరేదైనా ఘోరప్రమాదం జరిగినపుడు అతనికి దగ్గరి స్నేహితులు వచ్చి తమ సానుభూతి వ్యక్తపరుస్తారు. అతని బాధ పంచుకోబడుతుంది. ఇలాంటి సమయాలలో రావలసినవారు రాకుంటే తన బాధను వ్యక్తపరుస్తారు. అంటే సంతోషాన్ని గాని, బాధనుగాని
ఇతరులతో పంచుకోవడమనేది మానవ స్వభావం.
   ప్రతివ్యక్తి అంతరంగంలో సంవేదన ఉంటుంది. ఇతరుల కష్టాలతో పాలుపంచుకోవడం ఒక సహజ ప్రవృత్తి ఉదా : మీరు దారిలో వెళ్తున్నపుడు ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా కాలికి రాయి తగిలి పడిపోతాడు. అప్పుడు మీ శరీరం గగుర్పాటు చెంది నోటినుంచి అప్రయత్నంగా అయ్యో! అనే మాట వస్తుంది. ఇదంతా ఒక స్వాభావికమైన చర్య. టి.వి.ని నిలిపివేస్తే అంతామాయం. నిజంగా జరగడంలేగు అని మనకు తెలుసు అయినా కథలోని ఘట్టాలతో లీనమె మన కండ్లలో కన్నీరు వస్తుంది, ఇదంతా కూడా హృదయ సంవేదనయే
చర్య. మీరు టి.విలో రామాయణం సీరియల్ చూస్తుంటారు, 

దృశ్యానుభూతి (Exposure) తో సంవేదన : 
  మానవుని మనసులో ఉన్న ఈ సంవేదనను సహజ రూపంలో రేకెత్తిస్తే సేవా భావన నిర్మాణమవుతుంది. ఒకరకంగా చెప్పాలంటే ఏదైనా కష్టం గురించి విన్నా, చదివినా బాధ యొక్క అనుభూతి కలుగుతుంది. అదేకష్టాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ భావన, అనుభూతి మరింత అధికం అవుతుంది. దీనిని ఆంగ్లంలో Exposure అంటారు. ఇలాంటి దృశ్యానుభూతులే అనేక మంది గొప్ప వ్యక్తులలో ఒక మలుపు తీసుకువచ్చాయి. ప్రత్యక్ష సంఘటనలను చూడడం ద్వారానే వారి జీవితంలో గొప్ప పరివర్తన కలిగింది.

మహానుభావుల ఉదాహరణలు :
గౌతమబుద్ధుడు
గౌతమబుద్ధుడు
    శుద్దోదన మహారాజు కుమారుడు సిద్దార్థుడు గౌతమబుద్ధుడు ఎలా అయినాడు? రాజు తనకుమారుని ఎన్నో సుఖాలతో, భోగభాగ్యాలలో ఓడలాడిస్తూ పెంచాడు. అతను ఎలాంటి కష్టాలను, బాధలను చూడకూడదని, అతని మనసులో ఎన్నడూ విరక్తి కలగకూడదని ఇలాంటి వ్యవస్థ చేశాడు. అందమైన భార్యలభించింది. ముద్దులుముూటగట్టే కొడుకు జన్మించాడు. సిద్దార్థుడు ఇలా కొన్నిదినాలు మోహ పాశములతో బంధింపబడ్డాడు. ఒకరోజు అతడు సారథి ఛందకునితోపాటు వాహ్యళికి బయల్దేరాడు. మొదట ఒక ముసలి స్త్రీ కనిపించింది. ముడుతలు పడిన ముఖము, వంగిన నడుము, కర్ర సహాయంతో తడబడుతూ నడుస్తుంది. తర్వాత శుష్కించిన దేహముగల రోగి కనిపించాడు. ఆ తర్వాత నలుగురు మనుషులు భుజములపై ఎత్తుకొని మోస్తూ దానిపై పడుకొని ఉన్నట్టుగా ఒక వ్యక్తిని, అతనితోపాటు ఏడుస్తూ వెళ్తున్న బంధువులను చూశాడు.  ప్రతీసారి చందకుని వాటి గురించి అడిగాడు. ముసలితనం అందరికి వస్తుంది మనిషి రోగిష్టి అవుతాడు. మరియు ప్రతీ ఒకరు ఏదో ఒకరోజు చనిపోవలసినదే అని చందకుడు చెప్పాడు. ఈ దృశ్యాలను చూడడం అతని ఆలోచనా దిశను మార్చింది. సిద్దార్థుడు సర్వస్వం వదిలిపెట్టి సత్యాన్వేషియై బుద్ధుడైనాడు.

రామకృష్ణ పరమహంస
   పరమపూజ్య శ్రీగురూజీకి సన్యాసదీక్ష ఇచ్చిన గురువు స్వామి అఖండానందుడు రామకృష్ణ మిషన్ కు అధ్యక్షుడుగా వుండేవాడు. దాని ప్రధాన కార్యాలయం బేలూరు మఠము అది కలకత్తాలో ఉంది. ఒకసారి వారు ప్రయాణంలో బెంగాల్ లోని సారగాచీ అనే ప్రదేశానికి వెళ్లారు. అప్పుడు అక్కడ కరువు ఏర్పడి వున్నది. నీటి ఎద్దడి భయంకరంగా ఉంది. ఒక పేద బాలిక ఏడుస్తూ ఉండడం గమనించి వారు కారణం అడిగారు. బాలిక అన్నది. నీరుతేవడానికి ఒక కుండను తీసుకొని ఇంటినుంచి బయల్దేరాను. నీరు తెచ్చే తొందరలో మట్టికుండ క్రిందపడి పగిలిపోయినది. మరొక పాత్ర ఏది కూడా ఇంట్లో లేదు అని ఆ బాలిక చెప్పడంతో స్వామీజీకి ఎంతో బాధ కలిగింది. బజారుకు వెళ్ళి ఒక కుండ మరియు కొన్ని అటుకులను కొనుక్కొని వచ్చాడు. ఆకలితో ఉన్న పిల్లలు ఆయనను చుట్టుముట్టారు. వారు కుండను ఆ బాలికకు ఇచ్చి, ఆకలితో వున్న పిల్లలకు అటుకులను పంచిపెట్టారు. వారందరి ముఖాలు ఆనందంతో వికసించాయి. అయితే అక్కడి పేదరికాన్ని చూసి స్వామీజీ ద్రావించిపోయారు. ఆ నిరుపేదలకు సేవ చేయాలని వారు సారగాచీలోనే ఉండి పోవడానికి నిర్ణయించుకున్నారు. ప్రత్యక్షంగా ఆ దృశ్యాన్ని తమకండ్లతో చూడడంతో సంవేదనాశీలత ఉబికివచ్చింది.
   రామకృష్ణ పరమహంస ఒకసారి తన పరమభక్తుడైన మధురాబాబుతో కలిసి కాశీయాత్రకు బయల్దేరాడు. బీహార్లోని దేవదర అనే చోటికి చేరుకున్నారు. అక్కడ కఱవును చూశారు. ఆకలితో అలమటిస్తున్న వారిని చూసి మధురాబాబుతో వీరికి భోజనం పెట్టే ఏర్పాటు చేయమని చెప్పారు. ఉన్న డబ్బంతా ఖరచ్చయితే కాశీయాత్ర చేయలేమని మధురాబాబు అన్నారు. మంచిది, నీవు కాశీయాత్ర చెయ్యి, నేను వీరి సేవలో ఇక్కడే ఉంటాను అని రామకృష్ణులు అనగానే మధురాబాబు కలకత్తా నుండి డబ్బు తెప్పించి వారికి భోజనం ఏర్పాట్లు చేశాడు. అప్పుడు రామకృష్ణులు ముందుకు కదిలారు.
స్వామి వివేకానందుడు
స్వామి వివేకానందుడు
    స్వామి వివేకానందుడు భారతదేశమంతటా తిరుగుతూ దేశంలోని అసంఖ్యాకంగా పేదరికంతో మగ్గుతున్న వారిని ఆకలితో అలమటిస్తున్న వారిని, చదువురాని వారి దీనావస్థలను స్వయంగా తన కండ్లతో చూస్తూ కేరళలోని మలబార్ చేరాడు. అక్కడి దృశ్యాన్ని చూసి అతనికి పట్టరాని దు:ఖం కలిగింది. ఒక హరిజనుడు వీధిలో ఇలా అరుస్తూ వెళ్తున్నాడు. 'సోదరులారా తప్పుకోండి, తప్పుకోండి' అని తాను వస్తున్నట్టుగా వారికి సూచన ఇస్తున్నాడు, దానివల్ల వారందరు అతని నీడపడకుండా పక్కకు తప్పుకోవాలి. అది చూసి బరువైన మనసుతో స్వామిజీ 'కేరళవాసులు పిచ్చాసుపత్రిలో ఉండతగినవారు' అని అన్నారు. కన్యాకుమారి వద్ద సముద్రం
మధ్యలోగల గుట్ట (ఇప్పటిపేరు వివేకానంద శిలాస్మారకము)పై కూర్చొని ఆలోచించసాగారు. (ధ్యానంలో మునిగిపోయారు) ఎప్పటివరకైతే మన దేశంలోని ఒక్కవ్యక్తి అయినా ఆకలితో అలమటిస్తుంటాడో అప్పటివరకు నాకు మోక్షసాధన అవసరం లేదని వారు అన్నారు.
   వివేకానంద స్వామిజీ అమెరికా వెళ్లారు. చికాగో విశ్వమత మహానమ్మేళనంలో వారి ఉపన్యానంతో ప్రభావితుడైన అత్యధిక ధనవంతుడు ఒకరు వారికి తన ఇంట్లో ఆతిథ్యము ఇచ్చాడు. అక్కడి విలాసవంతమైన జీవన విధానాన్ని చూసి, తనదేశంలోని ఆకలితో అలమటిస్తూ ఒంటినిండా బట్టలు లేని బీదప్రజలను గుర్తు తెచ్చుకొని రాత్రంతా ఎడుస్తూనే ఉన్నారు. స్వయంగా తాను చూసిన దృశ్యాల బాధ దు:ఖాన్ని కలుగజేసింది.
   వేల సంవత్సరాల నుండి భగవంతుని సంతానమైన సామాన్యుడి నుండి ఋషులవరకు అనేకులు ఆకలితో ఉన్నారు. ఇప్పటికి ఆకలి బాధతో అలమటిస్తూనే ఉన్నారు. ఇదిచూస్తూ మీ కంటికి నిద్ర ఎలా వస్తుంది? మీకు బాధల అనుభూతి కలగడం లేదా? అలా కలిగితేనే మీకు దేశభక్తులు కాగలరు. అలాగే ఎవరి శ్రమ ఆధారంగా మీరు విద్యాబుద్ధులు గడించి, ఉద్యోగ వ్యాపారాలలో చేరి వైభవోపేతంగా జీవించు చున్నారో, వారిపట్ల మీ మనసులో శ్రద్ధ లేకుంటే మీరు దేశద్రోహులే అవుతారని వివేకానంద అంటారు. ఈరకమైన సంవేదనయే మనల్ని సేవకు ప్రేరేపించుతుంది.
  మరొక ఉదాహరణ : శ్రీ టి.టి.కృష్ణమాచారి ఒక గొప్ప పారిశ్రామికవేత్త. ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా పనిచేశారు. అతని కుమారుని వివాహము ధనిక కుటుంబానికి
చెందిన అమ్మాయితో జరిగింది. కుమారుడు మద్యపానానికి అలవాటుపడిన కారణంగా చనిపోయాడు. కోడలు శ్రీమతి శాంతి దిగ్రభాంతి చెందింది. ఆమె మనసు గాయపడింది
ఈ సంఘటనతో స్పందనాభరితమైన ఆమె మనసులో ఒక ఆలోచన జనించింది. నాలాంటి దురదృష్టవంతులైన సోదరీమణులు ఎందరో ఉంటారు. తమభర్తలు వ్యసనాలకు లోనైన కారణంగా వారికి కూడా ఇలాంటి దుర్దినాలు చూడవలసి వస్తుంది. ఈ ఆలోచనతో ప్రేరితురాలైన ఆమె ఒకవైద్యశాలను ఏర్పాటు చేసింది. అందులో వ్యసనాల బారినుంచి విముక్తి ప్రయత్నాలు జరుగుతాయి. ఇందుకోసం తన సంపదనంతా ఖర్చుచేసింది. ఇలాంటి అలవాట్లను దూరం చేయడానికి వ్యసనపరులైన రోగులకు ఆమె రాత్రింబవళ్ళు సేవచేసేది. తన కళ్ళ ముందర జరిగిన సంఘటన వలన ఐశ్వర్యంలో పుట్టి పెరిగినప్పటికీ టి.టి.కృష్ణమాచారి కోడలైన శ్రీమతి శాంతి జీవితంలో ఎంతో గొప్ప పరివర్తన వచ్చింది.
  మహారాష్ట్రలోని ఒక ప్రచారక్ తన అనుభవం ఇలా చెప్పారు. ఆయన ఇంజనీరింగ్ లో పట్టభద్రుడు. ప్రచారక్ గా వచ్చి సమాజసేవలో తరించాలని తరచు అతని మనసులో అనిపిస్తుండేది. కాని నిర్ణయం చేసుకోలేకపోతున్నాడు. ఒకరోజు ముంబైలోని చర్చ్ గేట్ వంతెన క్రిందినుంచి వెళ్తున్నాడు. అక్కడ అత్యంత దీనస్థితిలో ఉన్న రోగిష్ఠి బిచ్చగత్తెనుచూసి అతనిలో సమాజసేవ చేయాలనే అనుభూతి కలిగి ప్రచారక్ గా రావడానికి నిర్ణయించుకున్నాడు. 
  ప్రత్యక్షంగా చూడడం వల్ల పేదరికం పట్ల ఒక కల్పన కలుగుతుంది. ప.పూ.శ్రీ బాలాసాహెబ్జీ 'మీరు గనక పేద వారి ఇంట్లో జన్మించినట్టయితే వారి వరిస్థితి అర్థమవుతుంది, మన సోదర సోదరీమణులు ఎలా ఉంటున్నారు? ఎన్ని కష్టాలలో ఉన్నారు? ఆకలితో అర్ధనగ్నంగా, నిరక్షరులై కొట్టుమిట్టాడుచున్నారు. వీటన్నిటిని ప్రత్యక్షంగా చూడండి, అప్పుడు సేవచేయాలనే భావన
ఏర్పడుతుంది. స్వార్ధపరులు కొందరు అట్టి బలహీనవర్గాలను సామాజిక శోషణతో మరియు రాజకీయంగా దుర్వినియోగం చేస్తూ వాడుకుంటున్నారు' అని అన్నారు.
   మనం సామాజిక పరివర్తన రావాలని కోరుకుంటున్నాము. అందువల్ల మనశాఖ స్వయంసేవకులను వారంలో ఒకరోజు సేవాబస్తీలలోకి తీసుకెళ్లి అక్కడి ప్రత్యక్ష స్థితిని చూపించాలి. తర్వాత ఆ బస్తీలోని పరిస్థితుల గురించి వారితో చర్చించాలి. శాఖలలో సేవాభావాన్ని కలిగించే పాటలు పాడించండి. కథలు వినిపించండి. అనగా దయనీయ పరిస్థితుల ప్రత్యక్షానుభూతి (Eposure) ద్వారా సేవాభావనను నిర్మాణంచేయడం ప్రముఖ కార్యకర్తలందరి బాధ్యత. దీంతోపాటు స్వయంసేవకులే కాకుండా సమాజంలోని ఇతర బంధువులు మరియు మాతృమూర్తులు సోదరీమణులకు సైతం ఆ వర్గాల పరిస్థితిని ప్రత్యక్షంగా చూపించి వారిలో సేవాభావన జాగృతం చేయడం కూడా మన పనే.
   ఢిల్లీలో ఒకరు సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. పగటిపూట ఎంతైన తిరగండి. మీతోపాటు భోజనం ఇంటినుంచి వెంట తీసుకువెళ్ళండి, రాత్రి భోజనం ఇంట్లో చేయండి అని భార్య నియమం పెట్టింది. కానీ అనుకోని విధంగా కొన్ని రోజుల తర్వాత భార్య కూడా ఆ బస్తీలలోకి అతనితోపాటే వెళ్లడం ప్రారంభించింది. అక్కడి దృశ్యాలను ప్రత్యక్షంగా తనకండ్లతో చూసి చలించిపోయి సేవా కార్యక్రమాలలో ఎంతగా లీనమై పోయిందంటే తాను వేఱు వారు వేఱు అన్న ఆలోచనలను వదిలిపెట్టి తానుకూడా ఆ బస్తీకి చెందినదిగా కావడమే కాదు, ఆ బస్తీకి తల్లి అయింది.

ఇదీ చదవండి: 
ప్రకటన : “సంఘ "సేవా కార్యము" ఎందుకు? ఎలా?”  గత భాగాల కోసం క్లిక్ చేయండి:
➣ నాల్గవ భాగంఆర్ఎస్ఎస్ సేవాదృష్టి
➣ ఎనిమిదవ భాగంసంఘ సేవా భావన నిర్మాణం

{full_page}
script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-8151979495234585" crossorigin="anonymous">

#buttons=(Accept !) #days=(1)

We uses cookies. More..
Accept !
To Top